News March 17, 2024
జయప్రదకు భారీ ఊరట

ప్రముఖ నటి జయప్రదకు భారీ ఊరట లభించింది. ESIC కేసులో ఆమెకు ఎగ్మోర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు విధించిన 6 నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈఎస్ఐసీ కింద రూ.8 లక్షలు చెల్లించాల్సి ఉండగా.. జయప్రద నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడినట్లు థియేటర్ కార్మికులు ఫిర్యాదు చేశారు. దీనిపై మెట్రోపాలిటన్ కోర్టు శిక్ష విధించింది. మద్రాస్ హైకోర్టు కూడా ఆ తీర్పును సమర్థించడంతో ఆమె సుప్రీంకు వెళ్లారు.
Similar News
News September 15, 2025
పాడి పశువుల్లో పాలజ్వరం – లక్షణాలు

ఈ వ్యాధి అధిక పాలిచ్చే ఆవులు, గేదెల్లో ఎక్కువగా వస్తుంది. వ్యాధి సోకిన పశువులు సరిగా మేత మేయకపోవడం, నెమరు వేయకపోవడం, బెదురు చూపులతో చికాకుగా ఉండి, వణుకుతూ కదలలేని స్థితిలో ఉంటాయి. సరిగా నిలబడలేవు. పశువులు తమ తలను పొట్టకు ఆనించి.. S ఆకారంలో మగతగా పడుకొని ఉండటం పాల జ్వరంలో కనిపించే ప్రత్యేక లక్షణం. వ్యాధి తీవ్రమైతే శ్వాస, నాడి వేగం పూర్తిగా పడిపోయి పశువులు మరణించే అవకాశం ఉంది.
News September 15, 2025
పాడిపశువుల్లో పాలజ్వరం నివారణకు సూచనలు

పాలిచ్చే పశువులు చూడి దశలో ఉన్నప్పుడే దాణాలో సరిపడా కాల్షియం ఉండేలా చూసుకోవాలి. లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు, పచ్చిమేతలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. మేతలో తులసి, అవిసె, మల్బరీ, సుబాబుల్, మునగ వంటి ఆకుల్ని కలపడం వల్ల చాలావరకు పోషకాహార లోపాలను నివారించవచ్చు. పశువులు ఈనే 5 రోజుల ముందు నుంచి విటమిన్-డి ఇంజెక్షన్లు, ఈనిన వెంటనే కాల్షియంతో కూడిన ఇంజెక్షన్లు వెటర్నరీ నిపుణుల సూచనతో ఇవ్వాలి.
News September 15, 2025
కేంద్రానికి రూ.100 చెల్లిస్తే మనకి ఎంత తిరిగి వస్తుందంటే?

రాష్ట్రాలు పన్ను రూపంలో కేంద్రానికి చెల్లించే ప్రతి రూ.100లో తిరిగి ఎంత పొందుతాయో తెలుసా? అత్యల్పంగా మహారాష్ట్ర రూ.100 పన్నులో ₹6.8 మాత్రమే తిరిగి పొందుతోంది. అత్యధికంగా అరుణాచల్ ప్రదేశ్ ₹4278.8 తీసుకుంటుంది. ఆర్థిక సంఘం సూత్రాల ఆధారంగా జనాభా, ఆదాయ అసమానత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పంపిణీ చేస్తారు. TGకి ₹43.9, APకి ₹40.5 వస్తాయి. వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పడటమే దీని ఉద్దేశ్యం.