News June 13, 2024
సూపర్-8లో అడుగుపెట్టడం బిగ్ రిలీఫ్: రోహిత్

టీ20 వరల్డ్ కప్‌లో సూపర్-8కు చేరుకోవడం బిగ్ రిలీఫ్ అని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. ‘న్యూయార్క్ పిచ్‌పై ఆడటం తేలికేమీ కాదు. ఇలాంటి పిచ్‌పైన 110+ స్కోరైనా ఛేదించడం కష్టమే. ఏ క్షణంలోనైనా ఫలితం తారుమారయ్యే ఛాన్స్ ఉంది. సూర్య, దూబే రాణించడంతో మ్యాచ్ గెలిచాం. లీగ్ దశలో మూడు మ్యాచుల్లో విజయం సాధించాం. దీంతో మరింత ఆత్మవిశ్వాసంతో సూపర్-8లో ఆడతాం’ అని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Similar News
News September 12, 2025
రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు: జయప్రకాశ్ నారాయణ

AP: రాజకీయాన్ని తిట్టడం మనల్ని మనం అవమానించుకోవడమే అని వే2న్యూస్ కాన్క్లేవ్లో జయప్రకాశ్ నారాయణ పేర్కొన్నారు. ‘నిజాయితీ గల, దాపరికాలులేని చర్చ ఎంతో అవసరం. అలాంటి వేదికను ఏర్పాటు చేసిన వే2న్యూస్‌కు అభినందనలు. రాజకీయ నాయకులపై బురద చల్లడం, తిట్టడం చేస్తాం. కానీ కనిపిస్తే వంగి దండాలు పెడతాం. అతి వినయం, అవమానించడం అవసరం లేదు. రాజకీయాన్ని తిరస్కరించడం పరిష్కారం కాదు’ అని తెలిపారు.
News September 12, 2025
రాష్ట్రంలో 4,687 పోస్టులకు గ్రీన్ సిగ్నల్

AP: రాష్ట్రంలో ఉన్న 4,687 మినీ అంగన్వాడీ కార్యకర్తలకు ఇటీవల పదోన్నతి కల్పించిన ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా 4,687 హెల్పర్ల నియామకానికి అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో నియామక విధివిధానాలు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం ₹7,000 వేతనం అందుకుంటున్న కార్యకర్తలు ప్రమోషన్ల తర్వాత ₹11,500 అందుకోనున్నారు.
News September 12, 2025
రాష్ట్రంలో మరోసారి కుల గణన: సిద్దరామయ్య

కర్ణాటకలో మరోసారి కుల గణన చేయాల్సిన అవసరం ఉందని సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. ‘సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా మరోసారి సర్వే నిర్వహించబోతున్నాం. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ గణన జరుగుతుంది. 2015లో నిర్వహించిన సర్వే రిపోర్టును ప్రభుత్వం ఆమోదించలేదు. పదేళ్లు గడిచిపోయాయి. తాజాగా మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమైన సామాజిక న్యాయం దక్కాలి’ అని తెలిపారు.