News March 13, 2025
బిగ్ స్కామ్: Blinkitను గుడ్డిగా నమ్మవద్దంటున్న యూజర్

కస్టమర్లను Blinkit మోసగిస్తోందని ఓ యూజర్ Redditలో పోస్టు పెట్టారు. తాను అరకిలో ద్రాక్షపళ్లను ఆర్డర్ చేస్తే కేవలం 370గ్రా. డెలివరీ చేసిందన్నారు. డౌటొచ్చి మరోసారి ఆర్డర్ చేస్తే మళ్లీ ప్యాకేజ్‌తో సహా 370గ్రా. తూకమే ఉందని పేర్కొన్నారు. ఇదో పెద్ద స్కామ్ అని, ఆర్డర్ చేసినవి కాకుండా నాణ్యత లేని పండ్లు, కూరగాయాలు పంపిస్తోందని ఆరోపించారు. తమకూ ఇలాగే జరిగిందని యూజర్లు రిప్లై ఇచ్చారు. మీకూ ఇలాగే జరిగిందా?
Similar News
News March 13, 2025
సీఎం చంద్రబాబు పేరు సూర్యబాబు అవుతుందేమో: RRR

AP: అసెంబ్లీలో సీఎం చంద్రబాబుపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోలార్ విద్యుత్‌పై చర్చ సందర్భంగా ‘సూర్యశక్తిని ఒడిసిపడుతున్నందుకు సీఎం చంద్రబాబు పేరు ఇక సూర్యబాబుగా మారుతుందేమో’ అని అన్నారు. వెంటనే స్పందించిన సీఎం ‘మీరేదో నాకు కరెంట్ షాక్ ఇవ్వాలనుకుంటున్నారు’ అని నవ్వుతూ అన్నారు. దీంతో సభలోని మిగతా సభ్యులూ నవ్వారు.
News March 13, 2025
2100 నాటికి భారత జనాభా 153కోట్లు!

ఇండియాలో ప్రస్తుతం 140+ కోట్ల జనాభా ఉన్నట్లు అంచనా. అయితే, 2100 నాటికి ఇది 153.3 కోట్లకు చేరుతుందని UN పాపులేషన్ డివిజన్ పేర్కొంది. దీంతో మోస్ట్ పాపులేటెడ్ కంట్రీగా ఇండియా మారనుంది. చైనాలో మాత్రం జననాల రేటు పడిపోయి అక్కడి జనాభా 77 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఆ తర్వాత నైజీరియాలో 54 కోట్లు, పాకిస్థాన్‌లో 48 కోట్లు, కాంగోలో 43కోట్లు, అమెరికా 39కోట్ల మంది జనాభాకు చేరుకుంటుందని వెల్లడించింది.
News March 13, 2025
IPL: సూపర్ పవర్స్ ఉంటే మీరేం చేస్తారు?

క్రికెట్ అభిమానుల పండుగైన ‘IPL’ మరికొన్ని రోజుల్లో మొదలుకానుంది. ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ఈ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్గా మారనుంది. ఈసారైనా కప్ కొట్టేలా RCB వ్యూహాలను రచిస్తోంది. అయితే, మీకే సూపర్ పవర్స్ ఉంటే కిందివాటిలో ఏది చేస్తారు? 1.RCB తొలి ట్రోఫీని గెలవటం. 2. ధోనీ తన తొలి IPL సెంచరీని కొట్టడం. 3. రోహిత్ బ్యాటింగ్‌తో అదరగొట్టి ఆరెంజ్ క్యాప్ సాధించడం. 4. SRH 300 రన్స్‌ను దాటేయడం. COMMENT