News March 29, 2024

TDPకి భారీ ఎదురుదెబ్బ

image

AP: కూటమిలో భాగంగా సీట్ల కేటాయింపులతో టీడీపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్నవారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పెందుర్తి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అసంతృప్తితో ఉన్నారు.

Similar News

News January 10, 2026

కేంద్రమంత్రి సురేష్ గోపికి స్వాగతం పలికిన జీవీఎల్

image

కేంద్రమంత్రి, సినీ నటుడు సురేష్ గోపి శనివారం విశాఖ చేరుకున్నారు. ఈయనకు మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు స్వాగతం పలికారు. కేంద్రమంత్రి బీచ్ రోడ్డులోని లైట్ హౌస్ ఫెస్టివల్‌లో, అనంతరం ఏయూ గ్రౌండ్స్‌లో జరుగుతున్న ‘ఆత్మనిర్భర్ భారత్ మహా సంక్రాంతి’ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పర్యటనలో పెట్రోలియం, పర్యాటక రంగాలపై ఆయన సమీక్షలు నిర్వహించనున్నారు.

News January 10, 2026

ప్రీ బడ్జెట్ సమావేశం.. నిర్మలకు భట్టి విజ్ఞప్తులు

image

తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి కేంద్రమంత్రి నిర్మలను కోరారు. ఢిల్లీలో జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రీజినల్ రింగ్ రోడ్ (RRR) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని, మెట్రో ఫేజ్-2కు అనుమతులు ఇవ్వాలని కోరారు. పెద్దపల్లి, వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలను మంజూరు చేయాలన్నారు. హైదరాబాద్‌లో IIM ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News January 10, 2026

‘జన నాయగన్’ వాయిదా.. రీరిలీజ్‌తో వస్తోన్న విజయ్

image

జన నాయగన్ సినిమా విడుదల వాయిదా పడటంతో నిరాశలో ఉన్న ఫ్యాన్స్‌కు దళపతి విజయ్ గుడ్‌న్యూస్ చెప్పారు. సూపర్‌హిట్ సినిమా తేరీ (తెలుగులో పోలీసోడు)ను JAN 15న తమిళనాడులో రీరిలీజ్ చేస్తున్నట్టు నిర్మాణ సంస్థ వి.క్రియేషన్స్ SMలో ప్రకటించింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించారు. 2016లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది.