News September 27, 2024
BIG SHOCK: షిప్యార్డులో మునిగిపోయిన చైనా న్యూక్లియర్ సబ్మెరైన్!

సముద్రంలో ట్రయల్స్ కోసం సిద్ధం చేసిన చైనా జోహూ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్ మునిగిపోయిందని సమాచారం. మేలో వుహాన్ సిటీలో యాంగ్జీ నదీ తీరంలో దీనిని డాక్ చేసినట్టు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా US గుర్తించింది. జూన్లో చూస్తే అక్కడ ఫ్లోటింగ్ క్రేన్లు మాత్రమే ఉన్నాయని పెంటగాన్ ధ్రువీకరించింది. సబ్మెరైన్ మునిగిన విషయం డ్రాగన్ దాచడంలో ఆశ్చర్యమేమీ లేదని పేర్కొంది. దీంతో PLA సామర్థ్యంపై సందేహాలు పెరిగాయంది.
Similar News
News November 25, 2025
ఇంట్లోని ఈ వస్తువులతో క్యాన్సర్.. జాగ్రత్త!

ఇంట్లో వినియోగించే కొన్ని వస్తువులు క్యాన్సర్ కారకాలుగా మారుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దోమల కాయిల్స్, రూమ్ ఫ్రెష్నర్స్, నాన్ స్టిక్ పాత్రలు, ప్లాస్టిక్ డబ్బాలు, టాల్కమ్ పౌడర్, క్యాండిల్స్ పొగ & సిగరెట్ స్మోక్, తలకు వేసుకునే రంగుతో క్యాన్సర్ ప్రమాదం ఉందని తెలిపారు. ఇంట్లో గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవడం, వీటిని వాడటాన్ని తగ్గించడం/ ప్రత్యామ్నాయాలను వాడటం శ్రేయస్కరమని సూచించారు.
News November 25, 2025
సాయంత్రం ఎన్నికల సంఘం ప్రెస్మీట్

TG: రాష్ట్ర ఎన్నికల సంఘం సా.6.15 గంటలకు ప్రెస్మీట్ నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికలపై షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న క్యాబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు షెడ్యూల్ ఇచ్చి ఒకటి, రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయించినట్లు తెలుస్తోంది.
News November 25, 2025
500 దాటిన సౌతాఫ్రికా ఆధిక్యం

భారత్తో రెండో టెస్టులో సౌతాఫ్రికా మరింత పట్టు బిగిస్తోంది. ఆ జట్టు ఆధిక్యం 503 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్లో 489 రన్స్ చేసిన సఫారీ జట్టు రెండో ఇన్నింగ్స్లోనూ నిలకడగా ఆడుతోంది. ప్రస్తుతం 4 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. క్రీజులో ఉన్న స్టబ్స్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. అటు వికెట్లు తీసేందుకు భారత బౌలర్లు శ్రమిస్తున్నారు. జడేజా 3 వికెట్లు పడగొట్టారు.


