News February 8, 2025
ఆప్‌కు బిగ్ షాక్
అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొడదామనుకున్న ఆప్‌కు ఫలితాల్లో ఎదురుగాలి వీస్తోంది. BJP 42 చోట్ల లీడింగ్‌లో ఉండగా ఆ పార్టీ కేవలం 25 స్థానాల్లోనే ఆధిక్యంలో కొనసాగుతోంది. అంతకంటే ముఖ్యంగా ఆప్ అగ్రనేతలు వెనుకంజలో ఉండటం పార్టీ శ్రేణులను షాక్‌కు గురి చేస్తోంది. కేజ్రీవాల్, ఆతిశీ, మనీశ్ సిసోడియా, ఇమ్రాన్ హుస్సేన్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి వెనుకంజలోనే కొనసాగుతున్నారు.
Similar News
News February 8, 2025
1000 వికెట్లు సాధించడమే నా లక్ష్యం: రషీద్ ఖాన్
టీ20 ఫార్మాట్లో అత్యధిక వికెట్లు(461 మ్యాచుల్లో 633 వికెట్లు) తీసిన అఫ్గాన్ బౌలర్ రషీద్ ఖాన్ 1000 వికెట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1000 వికెట్లు దక్కించుకోవడమనేది నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత. ఫిట్‌గా ఉండి, ఇప్పుడు ఆడుతున్న స్థాయిలోనే ఆడితే మరో మూడు, నాలుగేళ్లలో కచ్చితంగా తీస్తా. 4అంకెల వికెట్లు అనేది బౌలర్ ఊహకు మాత్రమే సాధ్యం’ అని పేర్కొన్నారు.
News February 8, 2025
‘ఢిల్లీ కింగ్‌మేకర్: నిర్మలా సీతారామన్’
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయానికి FM నిర్మలా సీతారామనే ప్రధాన కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఈ నగరంలో ఎక్కువగా ఉద్యోగులే ఉంటారు. వారి చిరకాల కోరికైన Income Tax తగ్గింపును నిర్మలమ్మే తీర్చారని పేర్కొంటున్నారు. 50:50 ఉన్న విజయ సమీకరణాన్ని ఆమె BJP వైపు మార్చేశారని విశ్లేషిస్తున్నారు. బ్యాలెట్ ఓట్లలో 50% కన్నా ఎక్కువ వారికే పడటం దీనిని ప్రతిబింబిస్తోందని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.
News February 8, 2025
ఢిల్లీలో తొలి గెలుపు ఎవరిదంటే?
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలి గెలుపు ఆమ్ ఆద్మీ పార్టీని వరించింది. కొండ్లీ నియోజకవర్గానికి చెందిన ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తన సమీప అభ్యర్థి ప్రియాంక గౌతమ్(బీజేపీ)పై 6293+ ఓట్లతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం 12 రౌండ్లలో కౌంటింగ్ జరిగింది. ఆ తర్వాత లక్ష్మీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయం సాధించారు.