News June 1, 2024
తెలంగాణలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్: TV9 సర్వే

తెలంగాణలో ఈసారి బీఆర్ఎస్ కేవలం ఒకే స్థానానికి పరిమితం కావచ్చని TV9 చెబుతోంది. ఇక కాంగ్రెస్ 8 స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేస్తోంది. ఇదే సమయంలో గత లోక్‌సభ ఎన్నికల్లో 4 సీట్లు పొందిన బీజేపీ ఈసారి 7 చోట్ల గెలుస్తుందని ఎగ్జిట్‌పోల్ రిజల్ట్ వెల్లడించింది. హైదరాబాద్ స్థానంలో అసదుద్దీన్ గెలుస్తారని అంచనా వేస్తోంది.
Similar News
News February 21, 2026
FSL అగ్నిప్రమాదంలో 1,100 ఫైల్స్ బూడిద

TG: హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(FSL)లో అగ్నిప్రమాదం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 1,100 ఫైల్స్ అగ్నికి ఆహుతైనట్లు నాగ్‌పూర్ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం తేల్చింది. అయితే ఆయా కేసుల డేటా రికవరీకి అధికారులు యత్నిస్తుండగా అది సాధ్యం కాదని నాగ్‌పూర్ బృందం పేర్కొంది. దగ్ధమైన ఫైల్స్‌లో ఏయే కేసులు ఉన్నాయనేదానిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News February 21, 2026
ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ తీసుకోవచ్చా?

తల్లి, బిడ్డకు ధనుర్వాతం (టెటానస్ ఇన్ఫెక్షన్) రాకుండా నిరోధించడానికి ప్రెగ్నెన్సీలో TT ఇంజెక్షన్ కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు. దీన్ని రెండు డోసులు తీసుకోవాలి. 2/3 నెలలో మొదటి డోస్, ఆ తర్వాత నాలుగు వారాల గ్యాప్‌తో రెండో డోస్ తీసుకోవాలి. అలాగే ప్రెగ్నెన్సీకి ముందు మూడేళ్లలో TT ఇంజెక్షన్ తీసుకుంటే బూస్టర్ డోస్ సరిపోతుందని చెబుతున్నారు.
News February 21, 2026
మనిషికి ‘బర్డ్‌ఫ్లూ’ సోకిందన్న ప్రచారం అవాస్తవం: వైద్యారోగ్య శాఖ

AP: చిత్తూరు జిల్లాలో ఓ యువకుడికి బర్డ్‌ఫ్లూ సోకిందన్న ప్రచారాన్ని వైద్యారోగ్య శాఖ ఖండించింది. రాష్ట్రంలో ఎక్కడా మనుషులకు బర్డ్‌ఫ్లూ సోకలేదని స్పష్టం చేసింది. అనుమానిత లక్షణాలున్న 54 మందికి టెస్టులు చేయగా నెగటివ్ వచ్చిందని పేర్కొంది. ఇటీవల చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.


