News March 21, 2024
మ్యాచ్కు ముందు CSKకి బిగ్ షాక్?

రేపు జరిగే IPL తొలి మ్యాచ్లో CSK జట్టుకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. గత సీజన్లో CSK విజయానికి కృషి చేసిన బౌలర్ పతిరణ తొలి మ్యాచ్లో ఆడటం లేదని క్రికెట్ వర్గాలు తెలిపాయి. గాయం కారణంగా కొన్ని రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న పతిరణకు శ్రీలంక క్రికెట్ బోర్డు IPL ప్రారంభ మ్యాచ్కు వెళ్లేందుకు ఇంకా NOC జారీ చేయలేదని సమాచారం. కాగా, రచిన్ రవీంద్ర అరంగేట్రం చేయనున్నారు.
Similar News
News September 13, 2025
పిల్లలు మట్టి తింటున్నారా?

పిల్లలు ఎదిగేటప్పుడు చేతికి అందిన వస్తువులన్నీ నోట్లో పెట్టుకుంటారు. అయితే కొన్నిసార్లు మట్టి, సుద్ద, బొగ్గులు తింటుంటారు. దీన్ని వైద్య పరిభాషలో పైకా అంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఐరన్ లోపం, రక్తలేమి, ఆహారలేమి ఉన్న పిల్లలు ఇలాంటి పదార్థాలు తింటారని వెల్లడిస్తున్నారు. కాబట్టి పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందించాలని, సమస్య మరీ ఎక్కువగా ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
News September 13, 2025
డిగ్రీ అర్హతతో 394 జాబ్స్.. ఒక్క రోజే ఛాన్స్

ఇంటెలిజెన్స్ బ్యూరో(IB)లో 394 జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి రేపే చివరి తేదీ(SEP 14). డిగ్రీ ఉత్తీర్ణులై, 18-27 ఏళ్ల వయసున్నవారు అర్హులు. రిజర్వేషన్ను బట్టి సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి పేస్కేల్ రూ.25,500 నుంచి రూ.81,100 వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు <
#ShareIt
News September 13, 2025
మేం ఏ జట్టునైనా ఓడిస్తాం: పాక్ కెప్టెన్

తమ ప్రణాళికలను పక్కాగా అమలు చేస్తే ఏ జట్టునైనా ఓడిస్తామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా అన్నారు. భారత్తో మ్యాచ్ గురించి ఎదురైన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. ‘మా బౌలింగ్ అద్భుతంగా ఉంది. బ్యాటింగ్లో ఇంకా బెటర్ అవ్వాలి. ఇటీవల మా ఆటతీరు బాగుంది. ట్రై సిరీస్ను కూడా ఈజీగా విన్ అయ్యాం’ అని ఒమన్తో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించారు. ఆసియా కప్లో దుబాయ్ వేదికగా రేపు భారత్, పాక్ తలపడనున్న విషయం తెలిసిందే.