News April 15, 2025

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు బిగ్ షాక్?

image

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.

Similar News

News April 16, 2025

స్మితా సబర్వాల్‌కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

image

TG: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. IAS అధికారిణి <<16116901>>స్మితా సబర్వాల్ చేసిన పోస్టుపై<<>> చట్ట ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. BJP నేతలు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే కంచ భూములపై మోదీ మాట్లాడారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ, BRS కుట్ర పన్నుతున్నాయని విమర్శించారు. తమ ప్రభుత్వం కూలగొడితే కూలిపోయేది కాదని పేర్కొన్నారు.

News April 16, 2025

IPL: ఒకే ఓవర్‌లో 4, 4, 6, 4, 4

image

రాజస్థాన్‌పై ఢిల్లీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ విధ్వంసం సృష్టిస్తున్నారు. దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 4, 4 బౌండరీలు బాదారు. చివరి బంతికి సింగిల్ తీయడంతో ఆ ఓవర్‌లో మొత్తం 23 రన్స్ వచ్చాయి.

News April 16, 2025

గర్ల్‌ఫ్రెండ్ ఉందన్నందుకు యూఎస్ వీసా రిజెక్ట్

image

ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడికి US వీసా రాకుండా చేసింది. ఇంటర్వ్యూ కోసం అతడు ఎంబసీకి వెళ్లగా ‘మీకు USలో ఫ్యామిలీ/ఫ్రెండ్స్ ఉన్నారా’ అని ఆఫీసర్ ప్రశ్నించారు. ‘అవును, ఫ్లోరిడాలో నా గర్ల్‌ఫ్రెండ్ ఉంది. తనను కలవాలని ప్లాన్ చేసుకున్నా’ అని అతడు సమాధానమిచ్చాడు. అంతే మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్ చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడు రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా చర్చనీయాంశమైంది.

error: Content is protected !!