News October 31, 2024
భారత స్టార్ ప్లేయర్లకు బిగ్ షాక్

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్లు రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, మహ్మద్ షమీ, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ తదితరులకు ఆయా ఫ్రాంచైజీలు బిగ్ షాక్ ఇచ్చాయి. వీరందరిని వేలానికి వదిలేశాయి. దీంతో వీరందరూ వచ్చే నెలలో జరిగే మెగా వేలంలో ఉంటారు. వీరిలో కొందరు రూ.20 కోట్ల వరకు పలికే ఛాన్స్ ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News December 16, 2025
జింకు ఫాస్పేట్ ఎరతో ఎలుకల నివారణ

ఎలుకల వల్ల పంట నష్టం ఎక్కువగా ఉంటే పంట కాలంలో ఒక్కసారి మాత్రమే జింకు ఫాస్పేట్ ఎరను వాడాలి. దీనికి ముందుగా విషం లేని ఎరను 20 గ్రాములు (98శాతం నూకలు, 2శాతం నూనె) పొట్లాలుగా చేసి ఎలుక కన్నానికి ముందు ఒకటి చొప్పున ఉంచాలి. ఇలా ఎలుకకు 2 రోజులు అలవాటు చేసి 3వరోజు జింకు ఫాస్పేట్ ఎరను 10 గ్రాములు (96% నూకలు, 2% నూనె, 2% మందు) పొట్లాలుగా కట్టి ఎలుక కన్నంలో ఒకటి చొప్పున వేయాలి. ఇవి తిన్న ఎలుకలు మరణిస్తాయి.
News December 16, 2025
HCLలో 64 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్(HCL)లో 64 జూనియర్ మేనేజర్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://www.hindustancopper.com/
News December 16, 2025
ఇతిహాసాలు క్విజ్ – 98

ఈరోజు ప్రశ్న: భీముడు ఈ వీరుడితో 27 రోజులు పోరాడతాడు. శ్రీకృష్ణుడి సూచన మేరకు అతని శరీరాన్ని రెండు భాగాలుగా చీల్చి, వేర్వేరు దిక్కులకు పడేస్తాడు. ఈ విధంగా అస్తమించిన మహాభారత పాత్ర ఎవరిది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


