News August 20, 2025

IPL స్టార్స్‌ సుదర్శన్, ప్రసిద్ధ్‌కు బిగ్ షాక్

image

ఆసియా కప్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కానీ ఐపీఎల్ 2025 ఆరెంజ్ క్యాప్ విన్నర్ సాయి సుదర్శన్, పర్పుల్ క్యాప్ విన్నర్ ప్రసిద్ధ్ కృష్ణకు చోటు కల్పించలేదు. ఐపీఎల్ ప్రామాణికంగా వీరిని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేసింది. కానీ టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియా కప్ కోసం మాత్రం వారిని పట్టించుకోలేదు. కాగా గత సీజన్‌లో సుదర్శన్ 759 రన్స్ చేయగా ప్రసిద్ధ్ 25 వికెట్లు తీసి సత్తా చాటారు.

Similar News

News August 20, 2025

కోర్టులో ఏడుస్తూనే ఉన్నా: ధనశ్రీ వర్మ

image

టీమ్ ఇండియా క్రికెటర్ చాహల్‌తో విడాకుల సమయంలో కోర్టులో జరిగిన భావోద్వేగ క్షణాలను ధనశ్రీ వర్మ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘కోర్టు తీర్పు ఇచ్చే సమయంలో నేను అక్కడే నిలబడి ఉన్నా. నాకు తెలియకుండానే గట్టిగా కేకలు వేస్తూ ఏడుస్తున్నా. తీర్పు వచ్చిన వెంటనే చాహల్ బయటకి వెళ్లాడు. ‘బీ యువర్ ఓన్ షుగర్ డాడీ’ అనే టెక్ట్స్ ఉన్న టీషర్ట్ ధరించడం ఏంటి? ఆయన ఇంకా పరిణితి చెందాలి’ అంటూ చాహల్‌కు పరోక్షంగా చురకలంటించారు.

News August 20, 2025

EP-42: పేదరికానికి కారణాలు ఇవే: చాణక్య నీతి

image

ఎవరైనా తమ ఆదాయాన్ని సరిగ్గా నిర్వహించడంలో విఫలమైతే పేదరికంలో మగ్గుతారని చాణక్య నీతి చెబుతోంది. ‘డబ్బు పొదుపు చేస్తే పేదరికం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికల్లో నిర్లక్ష్యంగా ఉంటే అప్పులు పెరిగిపోతాయి. జూదం, మద్యం లాంటి వ్యసనాలకు బానిసైతే పేదరికంలోకి కూరుకుపోతారు. విద్యా నైపుణ్యాలు లేకపోయినా ఉపాధి దొరకక ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయి’ అని స్పష్టం చేస్తోంది. #<<-se>>#chanakyaneeti<<>>

News August 20, 2025

ASIA CUP: ప్చ్.. శ్రేయస్ అయ్యర్

image

టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. ఆసియా కప్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో అతడికి చోటు దక్కలేదు. దీంతో నెటిజన్లు BCCIపై ఫైర్ అవుతున్నారు. అయ్యర్‌ను BCCI రాజకీయాలకు బలి చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్, ఐపీఎల్‌లో 604 పరుగుల చేసిన అతడిని పట్టించుకోకపోవడం దారుణమని దుమ్మెత్తిపోస్తున్నారు. కావాలనే అతడిని తప్పించారని వాపోతున్నారు.