News February 1, 2025
జియో యూజర్లకు బిగ్ షాక్

2 డేటా ప్లాన్ల వ్యాలిడిటీలను రిలయన్స్ జియో తగ్గించింది. రూ.69, రూ.139 ప్లాన్ల గడువును 7 రోజులుగా ఫిక్స్ చేసింది. గతంలో బేస్ ప్లాన్ ఎన్ని రోజులు ఉంటే ఈ డేటా ప్యాక్స్ వ్యాలిడిటీ అప్పటివరకు ఉండేవి. ఇకపై రూ.69తో రీఛార్జ్ చేసుకుంటే 6GB, రూ.139తో చేస్తే వచ్చే 12GB డేటా వారం రోజులే పనిచేస్తుంది. అటు ఇటీవల తొలగించిన రూ.189 ప్లాన్(28 రోజులు, 2GB డేటా, అపరిమిత కాల్స్, 300 SMS)ను జియో మళ్లీ ప్రారంభించింది.
Similar News
News December 30, 2025
ICC ర్యాకింగ్స్: టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఐసీసీ తాజాగా విడుదల చేసిన T20I ఉమెన్స్ ర్యాంకింగ్స్లో షెఫాలీ వర్మ సత్తా చాటారు. శ్రీలంకతో టీ20 సిరీస్లో సూపర్ ఫామ్ కొనసాగిస్తున్న ఆమె ఏకంగా 4 స్థానాలు ఎగబాకి 736 పాయింట్లతో 6వ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. షెఫాలీ సహా టాప్ 10లో టీమ్ ఇండియా నుంచి ముగ్గురు ప్లేయర్స్ ఉండటం విశేషం. తొలిస్థానంలో ఆసీస్ ప్లేయర్ బెత్ మూనీ(794) ఉండగా రెండో స్థానంలో స్మృతి మంధాన(767), పదో స్థానంలో జెమీమా(643) ఉన్నారు.
News December 30, 2025
నిమ్మ తోటల్లో అంతర పంటలతో అధిక ఆదాయం

నిమ్మ తోటల్లో తొలి ఐదేళ్లు అంతర పంటలను సాగు చేసి రైతులు అదనపు ఆదాయం పొందవచ్చు. అంతర పంటలతో కలుపు ఉద్ధృతి కూడా తగ్గుతుంది. వేరుశనగ, పెసర, మినుము, చిక్కుడు, బీన్స్, బంతి, దోస, పుచ్చ, బీర, కాకర, ఉల్లిని అంతర పంటలుగా వేసుకోవచ్చు. టమాటా, మిరప, వంగ, బెండ, పొగాకు లాంటి పంటలు అంతర పంటలుగా వేస్తే నులు పురుగులు వచ్చే అవకాశం ఉంది కావున వాటిని అంతర పంటలుగా వేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు.
News December 30, 2025
నాగార్జున ఫిట్నెస్ సీక్రెట్ ఇదే

66 ఏళ్ల వయసులోనూ గ్లామర్, ఫిట్నెస్లో యంగ్ హీరోలకు గట్టి పోటీని ఇస్తున్నారు కింగ్ నాగార్జున. తాజాగా తన ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించారు. డైటింగ్ కంటే టైమ్కు ఫుడ్ తీసుకోవడమే తన ఆరోగ్య రహస్యమన్నారు. గత 45 ఏళ్లుగా ఒక్కరోజు కూడా జిమ్ మిస్ కాలేదని పేర్కొన్నారు. పాజిటివ్ థింకింగ్, మెంటల్ హెల్త్ కూడా కీలకమని చెప్పారు. 2025 సంవత్సరం తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా ఎంతో తృప్తినిచ్చిందని తెలిపారు.


