News November 28, 2024
కొండా సురేఖపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

TG: మంత్రి కొండా సురేఖపై నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాను నాంపల్లి కోర్టు పరిగణనలోకి తీసుకుంది. సురేఖపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. డిసెంబర్ 12న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని ఆమెకు సమన్లు జారీ చేసింది. కాగా తన పరువుకు భంగం కలిగించేలా అభ్యంతకర వ్యాఖ్యలు చేసిన సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని నాగార్జున పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 23, 2025
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్?

బిహార్ మహాఘట్‌బంధన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పేరును ప్రకటించే అవకాశం ఉంది. ఈ రోజు సాయంత్రం దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని ఆర్జేడీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు ఆ కూటమిలో సీట్ల పంపకాల వివాదం సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
News October 23, 2025
RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారం నిల్వలను క్రమంగా పెంచుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 880 టన్నుల రిజర్వులు ఉన్నట్లు RBI తాజా డేటా వెల్లడించింది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఇది $95 బిలియన్ (రూ.8.36 లక్షల కోట్లు)తో సమానం. 2025-26 FY తొలి 6 నెలల్లోనే 600 కేజీలను కొనుగోలు చేసింది. అంతర్జాతీయంగా ఆర్థిక, రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పసిడి ధరలు పెరుగుతున్నాయని ఆర్బీఐ వెల్లడించింది.
News October 23, 2025
రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలపై యూఎస్ ఆంక్షలు

రష్యా ప్రధాన ఆయిల్ కంపెనీలైన రాస్‌నెఫ్ట్, లూకోయల్‌పై యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో ఆ సంస్థలతో యూఎస్ వ్యక్తులు, సంస్థలు ఎలాంటి వాణిజ్యం చేయకుండా నిషేధం అమలులో ఉండనుంది. ఈ చర్యలు రష్యా శక్తి వనరులపై ఒత్తిడిని పెంచి, ఆ దేశ ఆర్థిక వ్యవస్థను బలహీనం చేస్తాయని పేర్కొన్నారు. శాంతికి తామే మొగ్గుచూపుతామని, ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించాలని రష్యాను కోరారు.