News December 23, 2024
మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
TG: మోహన్‌బాబుకు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
Similar News
News December 23, 2024
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను KIMS వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆక్సిజన్, వెంటిలేటర్ తొలగించినట్లు తెలిపారు. అతనికి జ్వరం తగ్గుముఖం పడుతోందని, తెల్ల రక్తకణాల సంఖ్య క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం పైపు ద్వారానే ఆహారం అందిస్తున్నట్లు హెల్త్ బులెటిన్‌లో వివరించారు.
News December 23, 2024
శ్రీరామ్ టాలెంట్‌ను 2004లోనే గుర్తించిన ZOHO సీఈవో
ఇండో అమెరికన్ శ్రీరామ్ కృష్ణన్‌ను AIపై వైట్‌హౌస్ సీనియర్ సలహాదారుగా <<14956777>>నియమించడంపై<<>> ZOHO CEO శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ‘2004లో శ్రీరామ్ SRM యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయినప్పుడు అతనిని రిక్రూట్ చేయాలనుకున్నా. కానీ అప్పటికే మైక్రోసాఫ్ట్ తీసేసుకుంది. తర్వాత సిలికాన్ వ్యాలీకి వెళ్లి వ్యాపారవేత్తగా మారారు. ట్రంప్ తన సాంకేతిక బృందానికి గొప్ప ప్రతిభను యాడ్ చేశారు’ అని Xలో రాసుకొచ్చారు.
News December 23, 2024
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో చాలా జిల్లాల్లో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొంది. వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలుంటాయని వెల్లడించింది.