News January 14, 2025
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు BIG షాక్!
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కష్టకాలం మొదలైనట్టే! 2025లో మిడ్ లెవల్ సాఫ్ట్వేర్ ఇంజినీర్లను AIతో రిప్లేస్ చేస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. ఇతర కంపెనీలూ ఇదే బాటలో నడుస్తాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం మనుషులు చేస్తున్న కాంప్లెక్స్ కోడింగ్ టాస్కులను హ్యాండిల్ చేయగలిగే AI సిస్టమ్స్‌ను మెటా సహా టెక్ కంపెనీలు డెవలప్ చేస్తున్నాయని తెలిపారు. కోడ్ రాయగలిగే AIను మోహరిస్తున్నామని వెల్లడించారు.
Similar News
News January 15, 2025
వరుసగా 8 హిట్లు ఖాతాలో..
దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. వరుసగా 8 సినిమాలు సక్సెస్ సాధించిన ఈతరం దర్శకుడు అనిల్ అని సినీ వర్గాలు తెలిపాయి. ఆయన డెబ్యూ మూవీ పటాస్ సూపర్ హిట్‌గా నిలవగా ఆ తర్వాత వచ్చిన సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3, భగవంత్ కేసరి సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటును ఆయన కొనసాగిస్తున్నారని పేర్కొన్నాయి.
News January 15, 2025
తుప్పు పట్టిన ఒలింపిక్స్ పతకాలు.. కొత్తవి ఇస్తామన్న కమిటీ
పారిస్ ఒలింపిక్స్‌లో అందజేసిన పతకాలలో నాణ్యత లేదని అథ్లెట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. షూటర్ మనూ భాకర్ కూడా తన పతకాలు రంగు వెలిశాయని, తుప్పు పట్టాయని తెలిపారు. ఈ మెడల్స్‌ను త్వరలోనే రీప్లేస్ చేస్తామని IOC ప్రకటించింది. ఫ్రాన్స్ కరెన్సీని ముద్రించే ‘ఫ్రెంచ్ స్టేట్ మింట్’ కొత్త పతకాలను తయారుచేస్తుందని పేర్కొంది. కాగా విజేతల కోసం ప్రఖ్యాత ‘ఐఫిల్ టవర్’ ఇనుమును మిక్స్ చేసి 5,084 పతకాలను రూపొందించారు.
News January 15, 2025
లాస్ ఏంజెలిస్‌లో ఆరని కార్చిచ్చు
అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. మంటలు ఆర్పేందుకు సిబ్బంది నిరంతరం కష్టపడుతున్నా వారికి వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా మారాయి. కాలిఫోర్నియాలో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. దీంతో మంటల వ్యాప్తి పెరిగే అవకాశముంది. నిరాశ్రయులైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 24 మంది మరణించగా 88వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.