News December 16, 2024
స్టార్ క్రికెటర్‌కు బిగ్ షాక్

బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్‌కు షాక్ తగిలింది. అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్లో అతను బౌలింగ్ చేయకుండా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఇంగ్లండ్, వేల్స్ క్రికెట్ బోర్డు ఈ ఆల్‌రౌండర్‌పై నిషేధం విధించగా, BCB కూడా తాజాగా ఈ ప్రకటన చేసింది. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అతడి బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు అందగా, పరీక్షలో మోచేయి పరిధి 15 డిగ్రీలను మించిన్నట్లు తేలింది.
Similar News
News January 16, 2026
స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం: సుప్రీంకోర్టు

TG: BRS MLAల పార్టీ ఫిరాయింపు కేసులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పీకర్‌కు ఇదే చివరి అవకాశమని వ్యాఖ్యానించింది. ‘ఇప్పటికే తగిన సమయం ఇచ్చాం. ఇకనైనా నిర్ణయం తీసుకోకుంటే పరిణామాలు ఉంటాయి. మిగిలిన ముగ్గురు MLAలపై నిర్ణయం తీసుకోండి’ అని ఆదేశించింది. ముగ్గురు ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసేందుకు స్పీకర్ 4 వారాల టైమ్ కోరగా 2 వారాల్లో ప్రగతి చూపిస్తే 4 వారాల సమయం ఇస్తామని SC తెలిపింది.
News January 16, 2026
సొంతింటి ‘బడ్జెట్’కు నిర్మలమ్మ బూస్ట్?

వచ్చే బడ్జెట్లో ‘అఫర్డబుల్ హౌసింగ్’కు ఊపిరిపోయాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ₹45 లక్షల ధర పరిమితిని ₹75 లక్షల నుంచి ₹95 లక్షల వరకు పెంచాలనే డిమాండ్ వినిపిస్తోంది. లగ్జరీ ఇళ్ల అమ్మకాలు పెరుగుతున్నా సామాన్యుడికి ఇల్లు భారమవుతోందని.. పన్ను రాయితీలు, అద్దె గృహాలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హోమ్ లోన్ వడ్డీ మినహాయింపును ₹5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు.
News January 16, 2026
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడికి 5 ఏళ్ల జైలు

దక్షిణ కొరియాలో ‘మార్షల్ లా’ విధించి విఫలమైన మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కు కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. అరెస్టు కాకుండా అధికారులను అడ్డుకోవడం, పత్రాల ఫోర్జరీ వంటి కేసుల్లో ఈ తీర్పు వెలువడింది. ఆ దేశ చరిత్రలో పదవిలో ఉండగా అరెస్టయిన తొలి అధ్యక్షుడు ఆయన. అయితే ఆయనపై ఉన్న అత్యంత తీవ్రమైన ‘రాజద్రోహం’ కేసులో ప్రాసిక్యూటర్లు మరణశిక్ష కోరగా.. దానిపై ఫిబ్రవరిలో తుది తీర్పు వెలువడనుంది.


