News March 22, 2024

టీడీపీకి బిగ్ షాక్?

image

AP: గుంటూరు జిల్లాలో TDPకి బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ TDPకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెనాలి టికెట్ జనసేనకు కేటాయించడంతో.. గుంటూరు-2, పెనమలూరు స్థానాలపై ఆయన ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల గుంటూరు-2 మాధవికి, పెనమలూరు బోడే ప్రసాద్‌కు CBN కేటాయించారు. దీంతో అసంతృప్తితో ఉన్న రాజా.. సాయంత్రం కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై ప్రకటించనున్నారు.

Similar News

News September 10, 2025

తమిళ సినిమాలకు రూ.1000 కోట్లు అందుకే రావట్లేదు: శివకార్తికేయన్

image

రాబోయే రోజుల్లో తమిళ సినిమాలు ₹1000 కోట్ల కలెక్షన్ మార్కును చేరుకుంటాయని శివకార్తికేయన్ ఆశాభావం వ్యక్తం చేశారు. టికెట్ ధరలు పెంచకపోవడం, 4 వారాలకే సినిమాలు OTTలోకి వస్తుండటం వల్ల ₹1000Cr కలెక్షన్స్ రాబట్టలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ప్రేక్షకులకు కంటెంట్‌తో మెప్పించిన మూవీలే పాన్ ఇండియా సినిమాలు అవుతాయన్నారు. 4 వారాలకే OTTలోకి రావడంతో థియేటర్లలో లాంగ్ రన్ ఉండట్లేదని పేర్కొన్నారు.

News September 10, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (సెప్టెంబర్ 10, బుధవారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 4.51 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.03 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.13 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.37 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.22 గంటలకు
✒ ఇష: రాత్రి 7.35 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News September 10, 2025

శుభ సమయం (10-09-2025) బుధవారం

image

✒ తిథి: బహుళ తదియ సా.6.25 వరకు
✒ నక్షత్రం: రేవతి రా.7.44 వరకు
✒ శుభ సమయములు: ఉ.9.45-ఉ.10.10, సా.4.10-సా.5.10
✒ రాహుకాలం: మ.12.00-మ.1.30
✒ యమగండం: ఉ.7.30-ఉ.9.00
✒ దుర్ముహూర్తం: ఉ.11.36-మ.12.24
✒ వర్జ్యం: ఉ.8.25-ఉ.9.56
✒ అమృత ఘడియలు: సా.5.28-సా.6.58