News May 27, 2024

టీ20 WCకి ముందు వెస్టిండీస్‌కి బిగ్ షాక్

image

T20 వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ గాయం కారణంగా దూరమయ్యారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో వోర్సెస్టర్‌షైర్ తరఫున ఆడుతుండగా అతను గాయపడినట్లు విండీస్ బోర్డు తెలిపింది. కానీ గాయానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించలేదు. అతని స్థానంలో ఓబేడ్ మెక్కోయ్‌ను ఎంపిక చేసింది. హోల్డర్ లాంటి సీనియర్ ప్లేయర్ WCకి దూరమవడం దురదృష్టకరం అని చీఫ్ సెలక్టర్ డెస్మండ్ హేన్స్ అభిప్రాయపడ్డారు.

Similar News

News January 18, 2025

ఈ ఏడాది గరిష్ఠంగానే భారత్‌ వృద్ధి రేటు: IMF

image

ఈ ఏడాదికిగానూ ప్రపంచదేశాల వృద్ధి రేటు అంచనాలతో ఐఎంఎఫ్ ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది భారత వృద్ధి రేటు గరిష్ఠంగా 6.5గా ఉండగా ఈ ఏడాదీ అదే కొనసాగుతుందని అంచనా వేసింది. మరోవైపు అడ్వాన్స్‌డ్ ఎకానమీగా పేరొందిన USA వృద్ధి రేటు 2.7గా ఉండొచ్చని పేర్కొంది. మధ్య ఆదాయ, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 4.2గా అల్ప ఆదాయ దేశాల్లో 4.6గా వృద్ధి రేటు ఉండే అవకాశం ఉందని వెల్లడించింది.

News January 18, 2025

సైఫ్‌పై దాడిలో ఆధారాలు గుర్తింపు: ఫడ్నవీస్

image

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై దాడి ఘటనలో పోలీసులు కొన్ని ఆధారాలను గుర్తించినట్లు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితుడి చిత్రాలను స్పష్టంగా కనుగొన్నట్లు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతోందని, అతి త్వరలోనే నిందితుడిని పోలీసులు పట్టుకుంటారని చెప్పారు. కాగా బాలీవుడ్ స్టార్లపై వరుస దాడుల నేపథ్యంలో మహా ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

News January 18, 2025

నేడు రాష్ట్రానికి అమిత్ షా

image

AP: కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇవాళ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం గన్నవరం చేరుకొని అక్కడి నుంచి ఉండవల్లి వెళ్లి చంద్రబాబు నివాసంలో విందుకు హాజరుకానున్నారు. అనంతరం విజయవాడలోని హోటల్‌లో బస చేయనున్నారు. రేపు గన్నవరంలో సమీపంలోని NIDM సెంటర్, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ప్రాంగణాలను ఆయన ప్రారంభిస్తారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.