News September 12, 2024

వైసీపీకి భారీ షాక్?

image

AP: ప్రకాశం జిల్లాలో YCPకి భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. గత కొంతకాలంగా పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీని వీడుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. నిన్న జగన్‌తో జరిగిన చర్చలూ అసంతృప్తిగానే ముగిసినట్లు సమాచారం. ఒకవేళ ఆయన రాజీనామా చేస్తే ఏ పార్టీలో చేరుతారనే ఆసక్తి నెలకొంది. పవన్ కళ్యాణ్‌తో ఆయనకి మంచి సంబంధాలుండటంతో జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News September 13, 2025

ఆంధ్ర క్రికెట్ హెడ్ కోచ్‌గా గ్యారీ స్టీడ్

image

ఆంధ్ర మెన్స్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ హెడ్ కోచ్ గ్యారీ స్టీడ్‌ను ACA నియమించింది. ఈ నెల 20-25 తేదీల మధ్య ఆయన బాధ్యతలు చేపడతారని సమాచారం. కాగా గ్యారీ ఆధ్వర్యంలో కివీస్ 2019 WC ఫైనల్ చేరుకుంది. అలాగే 2021 WTC టైటిల్ సాధించింది. మరోవైపు ఆంధ్ర గత రంజీ సీజన్‌లో గ్రూప్-Bలో ఆరో స్థానంలో నిలిచింది. VHTలో గ్రూప్-Bలో నాలుగు, SMATలో ప్రీక్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లింది.

News September 13, 2025

బాగా నమిలి తినండి: వైద్యులు

image

ఆహారాన్ని గబగబా తినొద్దని, అలా చేస్తే సరిగ్గా జీర్ణం కాదని వైద్యులు చెబుతున్నారు. ఎంత తక్కువ సమయంలో తినడం పూర్తి చేస్తే అంత ఎక్కువగా బరువు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వేగంగా, నమలకుండా తింటే సరిపడనంత తిన్నామనే భావన కలగదని.. అరగంట పాటు నెమ్మదిగా, బాగా నమిలి తినాలని సూచిస్తున్నారు. దీనివల్ల అది పూర్తిగా జీర్ణమై పోషకాలన్నీ శరీరానికి అందుతాయని, అలాగే దవడలకూ మేలు జరుగుతుందని వివరిస్తున్నారు.

News September 13, 2025

ఇండియా-పాక్ మ్యాచ్ బాయ్‌కాట్ చేయాలి: రాజా సింగ్

image

పాకిస్థాన్‌తో టీమ్ ఇండియా మ్యాచ్ ఆడొద్దని TG ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ఆసియా కప్‌లో రేపు జరిగే మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని పిలుపునిచ్చారు. పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో మ్యాచ్ సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. భారతీయులందరూ ఇదే డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అటు ఈ మ్యాచ్ చూసేందుకు ఆసక్తి చూపకపోవడంతో టికెట్ సేల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి.