News October 25, 2024
BIG SHOCK: 7 వికెట్లు కోల్పోయిన భారత్

న్యూజిలాండ్తో 2వ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. దీంతో లంచ్ సమయానికి 107 రన్స్ మాత్రమే చేసి 7 కీలక వికెట్లు కోల్పోయింది. జైస్వాల్(30), గిల్(30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. రోహిత్(0), కోహ్లీ(1), పంత్(18), సర్ఫరాజ్(11), అశ్విన్(4) నిరాశపరిచారు. క్రీజులో జడేజా(11), సుందర్(2) ఉండగా భారత్ ఇంకా 152 రన్స్ వెనుకబడి ఉంది. శాంట్నర్ 4, ఫిలిప్స్ 2 వికెట్లు తీశారు.
Similar News
News November 20, 2025
కైకలూరులో ఈనెల 20న జాబ్ మేళా: జితేంద్ర

కైకలూరు ట్రావెల్స్ బంగ్లాలో ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి జితేంద్ర బుధవారం తెలిపారు.13కి పైగా కంపెనీ ప్రతినిధులు పాల్గొంటారని,1,010 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, విద్యార్హత కలిగిన 18-30 ఏళ్లవారు అర్హులన్నారు. బయోడేటా, సర్టిఫికెట్స్ జిరాక్స్లతో రావాలన్నారు.
News November 20, 2025
క్రెడిట్ కార్డ్ హోల్డర్స్కు ‘ఫేక్ కాల్స్’ అలర్ట్

సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వినియోగదారులను టార్గెట్ చేసుకుని స్కామ్ చేస్తున్నట్లు PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం హెచ్చరించింది. ‘ఓ స్కామ్లో మీ క్రెడిట్ కార్డు వాడారు. మీ కార్డును బ్లాక్ చేయబోతున్నాం’ అని RBI పేరిట వచ్చే కాల్స్, వాయిస్ మెయిల్స్, మెసేజెస్ అన్నీ ఫేక్ అని తేల్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వ లోగో, ఫొటో, వీడియోలు వాడిన అంశాలపై ఎలాంటి అనుమానం ఉన్నా ‘8799711259’ నంబరుకు పంపాలని సూచించింది.
News November 20, 2025
నేటి ముఖ్యాంశాలు

☛ AP: సత్యసాయి శతజయంతి వేడుకలకు హాజరైన PM మోదీ, CM CBN, సచిన్, ఐశ్వర్యరాయ్
☛ AP: సూపర్ సిక్స్ను సూపర్ హిట్ చేశాం: చంద్రబాబు
☛ TGలో ఇందిరమ్మ చీరల పంపిణీని ప్రారంభించిన CM రేవంత్
☛ TG: పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితా సవరణకు EC షెడ్యూల్
☛ ప్రజల సొమ్ముతో CBN, పవన్, లోకేశ్ జల్సాలు: YCP
☛ AP: మారేడుమిల్లి ఎన్కౌంటర్లో ఏడుగురు మావోలు మృతి


