News September 26, 2024
కోల్‌కతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్

ట్రైనీ డాక్టర్‌పై హత్యాచార కేసులో కోల్‌కతా పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారని ప్రత్యేక కోర్టుకు సమర్పించిన పిటిషన్లో సీబీఐ తెలిపింది. పోలీస్ అధికారి అభిజిత్ మండల్, ఆర్జీకర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ విచారణలో ఈ విషయాలు బయటపడ్డాయని పేర్కొంది. దీంతో మరిన్ని ఆధారాలను గుర్తించే పనిలో ఉన్నామని, వారిద్దరికీ ఈనెల 30 వరకు జుడీషియల్ కస్టడీ విధించాలని కోరింది. కాగా సీబీఐ వాదనలతో కోర్టు ఏకీభవించింది.
Similar News
News December 9, 2025
ములుగు జిల్లాలో మూగబోయిన మైకులు..!

జిల్లాలోని మొదటి విడత ఎన్నికల్లో భాగంగా నేటితో ప్రచారం ముగిసింది. ఎన్నికల నియామవళి ప్రకారం నేటి సాయంత్రానికి ప్రచారం ముగియడంతో ఆయా పార్టీల ప్రచార రధాలు, మైకులు మూగబోయాయి. ఈనెల 11న జిల్లాలోని గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాలకు మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. అందుకు కావలసిన ఏర్పాట్లను ఇప్పటికే జిల్లా అధికారులు సిద్ధం చేశారు.
News December 9, 2025
భూసమస్యలకు ఇక JCలదే బాధ్యత: అనగాని

AP: జీరో ఎర్రర్ రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ‘గత పాలకుల పాపాలను కడిగేందుకు కృషి చేయడంతో ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయాం. అన్ని జిల్లాల్లో రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే జాయింట్ కలెక్టర్లు పనిచేయాలని CM స్పష్టం చేశారు. JCలు లేని జిల్లాలకు వెంటనే నియమించాలన్నారు. ఇకపై భూసమస్యలన్నింటికీ JCలదే బాధ్యత’ అని తెలిపారు.
News December 9, 2025
మరికొన్ని గంటల్లో బంద్.. నివారణకు ప్రభుత్వం చర్యలు

AP: అర్ధరాత్రి నుంచి రాష్ట్రంలో సరకు రవాణా లారీలు బంద్ పాటించనున్నాయి. దీన్ని ఆపేందుకు ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. లారీ ఓనర్ల అసోసియేషన్ నేతలతో రవాణాశాఖ కమిషనర్ కాసేపట్లో భేటీ కానున్నారు. బంద్ నిర్ణయాన్ని విరమించాలని కోరనుండగా, దీనిపై నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తిగా మారింది. 13-20ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్ ఛార్జీలు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ లారీ యజమానులు బంద్ చేయనున్నారు.


