News October 22, 2025
బిగ్ ట్విస్ట్.. హోల్డ్‌లో నవీన్ యాదవ్ నామినేషన్!

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్‌పై ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆయన నామినేషన్‌కు రిటర్నింగ్ అధికారి ఇంకా ఆమోదం తెలపలేదు. ఫామ్-26 తొలి 3 పేజీల కాలమ్స్ విషయంలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో వాటిని ఆర్వో నిశితంగా పరిశీలిస్తున్నారు. ఈక్రమంలోనే మళ్లీ పిలుస్తామని, వెయిట్ చేయాలని నవీన్‌కు సూచించారు. దీంతో INC శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Similar News
News February 14, 2026
కూలి కూటికిరాదు, లేకి చేతికిరాదు

వ్యవసాయం, వ్యాపారం ఏదైనా అన్ని పనులకూ కూలీల మీదే ఆధారపడితే చేతికి వచ్చే లాభం కూలీలకే సరిపోతుంది. యజమానికి కనీసం తిండికి కూడా మిగలదు. అందుకే సాధ్యమైనంత వరకు మన పనులను మనమే చేసుకోవాలి. అలాగే ఇతరులకు పని అప్పగించేటప్పుడు నిర్లక్ష్యం, బాధ్యత లేనివారికి అప్పగిస్తే, ఆ పని పూర్తికాదు సరికదా, ఆశించిన ఫలితం మన చేతికి అందదు. అందుకే పని అప్పగించినా మన పర్యవేక్షణ తప్పక ఉండాలని ఈ సామెత తెలియజేస్తుంది.
News February 14, 2026
‘వీరు ఉపవాసం ఉండకపోవడం ఉత్తమం’

భక్తితో పాటు ఆరోగ్యం కూడా ముఖ్యమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి గర్భిణీలు ఆరోగ్యం దృష్ట్యా ఉపవాసానికి దూరంగా ఉండటం మేలు. మధుమేహం, గుండె జబ్బులు, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, వృద్ధులు కఠిన ఉపవాసం చేయకూడదంటున్నారు డాక్టర్లు. ‘శారీరక ఇబ్బందులున్న మహిళలు ఉపవాసం మానేయవచ్చు. ఆహారం తీసుకుంటూ శివ నామస్మరణ, ధ్యానం చేస్తే అంతటి సమానమైన పుణ్యం లభిస్తుంది’ అని పండితులు సూచిస్తున్నారు.
News February 14, 2026
మున్సిపల్ ఫలితాలు.. బీజేపీ ‘సున్నా’

TG: 116 మున్సిపాలిటీల్లో BJP ఒక్క స్థానంలోనూ గెలవలేకపోయింది. ఏకంగా 45 మున్సిపాలిటీల్లో ఒక్క వార్డూ సొంతం చేసుకోలేదు. ఉమ్మడి వరంగల్, MBNR, ఖమ్మం, NLG జిల్లాల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. 3 మున్సిపాలిటీల్లో (ఆదిలాబాద్, మెట్‌పల్లి, నారాయణపేట్) మాత్రమే మిగతా పార్టీల కంటే ఎక్కువ వార్డులు గెలుచుకుంది. అయితే బండి సంజయ్ ఒంటరి ప్రచారం తన పార్లమెంటు పరిధిలోని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కట్టబెట్టింది.


