News September 12, 2024
DSC అభ్యర్థులకు BIG UPDATE

TG: టెట్ మార్కుల సవరణకు DSC అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. ఇవాళ, రేపు వెబ్సైటులో అభ్యర్థులు టెట్ హాల్‌టికెట్ నంబర్, మార్కులు, ఇతర వివరాల్లో మార్పులు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 13 తర్వాత మార్పులకు మరో అవకాశం ఉండదని, ఇదే లాస్ట్ ఛాన్స్ అని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి తెలిపారు. మరిన్ని వివరాలకు https://schooledu.telangana.gov.in/ISMS/ను చూడండి.
Similar News
News November 22, 2025
నట్స్‌తో బెనిఫిట్స్: వైద్యులు

నిత్యం స్నాక్స్‌గా ఉపయోగించే నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్యులు చెబుతున్నారు. రోజు కొన్ని నట్స్ తింటే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని 50% వరకు తగ్గించవచ్చని పలు అధ్యయనాలు వెల్లడించాయన్నారు. వీటిలోని ఫైబర్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, యాంటీ ఆక్సిడెంట్స్.. ఇన్ఫ్లమేషన్ను తగ్గించి, పేగుల ఆరోగ్యాన్ని బలపరుస్తాయని తెలిపారు. రోజూ కొన్ని నట్స్ తింటే చాలా మంచిదని పేర్కొంటున్నారు.
News November 22, 2025
రెండేళ్ల నుంచి పేలుళ్లకు సిద్ధమవుతున్నాం: షకీల్

ఢిల్లీ పేలుడు కేసులో కీలక నిందితుడు డాక్టర్ ముజమ్మిల్ షకీల్ విచారణలో కీలక విషయాలు వెల్లడించాడు. రెండేళ్లుగా పేలుళ్ల కోసం సిద్ధమవుతున్నట్టు ఒప్పుకున్నాడు. యూరియా, అమోనియం నైట్రేట్, 26 క్వింటాళ్ల NPK ఫెర్టిలైజర్, కెమికల్స్ నిల్వ కోసం డీప్ ఫ్రీజర్‌ను ముజమ్మిల్ కొనుగోలు చేశాడు. కుట్రకు నిందితులే రూ.26 లక్షలు సమకూర్చుకున్నారు. పేలుళ్లలో ఉమర్ మరణించగా, మిగతా నిందితులు కస్టడీలో ఉన్నారు.
News November 22, 2025
బొద్దింకలతో కాఫీ.. టేస్ట్ ఎలా ఉందంటే?

ఏదైనా తినే పదార్థంలో బొద్దింక పడితే మనమైతే దానిని చెత్తబుట్టలో పడేస్తాం. కానీ చైనాలోని బీజింగ్‌లో ఓ కీటకాల మ్యూజియంలో ప్రత్యేకంగా ‘బొద్దింక కాఫీ’ని ప్రవేశపెట్టారు. దీని ధర సుమారు 45 యువాన్లు (US$6). రుచి చూసిన కస్టమర్లు ఇది కాల్చిన- పుల్లటి ఫ్లేవర్ వస్తోందని తెలిపారు. కాఫీపై రుబ్బిన బొద్దింకలు, ఎండిన పసుపు మీల్‌వార్మ్‌లను చల్లుతారు. ఈ వింత డ్రింక్ యువతను ఆకర్షిస్తూ ఆన్లైన్లో వైరల్ అవుతోంది.


