News January 27, 2025

ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులపై BIG UPDATE

image

TG: ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ జోరుగా సాగుతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలానికొకటి చొప్పున ఎంపిక చేసిన గ్రామాల్లో తొలిరోజు 15,414 కొత్త రేషన్ కార్డులు జారీ చేసినట్లు వెల్లడించారు. పాత కార్డుల్లో 1.03 లక్షల మంది పేర్లు చేర్చినట్లు పేర్కొన్నారు. 561 గ్రామాల్లో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రారంభమైందని, 20,336 మంది అకౌంట్లలో ₹6K చొప్పున జమ చేసినట్లు చెప్పారు.

Similar News

News October 15, 2025

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పేరు ఖరారైంది. కీర్తీ రెడ్డి, పద్మా వీరపునేని, ఆలపాటి లక్ష్మీనారాయణ, ఆకుల విజయ, కొంపల్లి మాధవి టికెట్ కోసం పోటీ పడ్డా చివరికి దీపక్‌ వైపే అధిష్ఠానం మొగ్గు చూపింది. కాగా 2023 ఎన్నికల్లోనూ దీపక్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు.

News October 15, 2025

ఇక సెలవు.. ఆయుధం వదిలిన ‘అడవిలో అన్న’

image

మావోయిస్టు పార్టీలో ఓ శకం ముగిసింది. 40 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి టాప్ కమాండర్ మల్లోజుల వేణుగోపాల్ సెలవు పలుకుతూ జనజీవన స్రవంతిలో కలిశారు. 1981లో అజ్ఞాతంలోకి వెళ్లి ఏటూరునాగారం దళ సభ్యుడిగా ఆయుధం చేతబట్టారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. 1993లో DKS జడ్పీ సభ్యుడిగా, 1995లో కేంద్ర కమిటీ సభ్యుడిగా, 2007లో పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. 4 దశాబ్దాల్లో ఎన్నో ఎన్‌కౌంటర్లకు నాయకత్వం వహించారు.

News October 15, 2025

ఈ మొక్క ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే!

image

క్రాసులా ఒవాటా అనే శాస్త్రీయ నామం గల ‘జేడ్’ ప్లాంట్ అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. నాణెం ఆకారంలో ఉండే వీటి ఆకులు సంపదకు చిహ్నంగా భావిస్తారు. దీనిని ఆగ్నేయ దిశలో ఉంచితే పాజిటివ్ ఎనర్జీ పెంచి ఒత్తిడి తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శాస్త్రీయంగా ఇది ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్‌గా పనిచేసి బెంజీన్ వంటి విషపదార్థాలను తొలగిస్తుంది. Share It