News June 17, 2024
రూ.2లక్షల రుణమాఫీపై BIG UPDATE
TG: ఆగస్టు 15లోపు రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాస్‌బుక్‌లు, రేషన్‌కార్డులున్న వారి రుణాలనే మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. MPలు, MLAలు, MLCలు, ఆదాయపన్ను చెల్లించేవారు, ఉద్యోగులను మినహాయించనున్నట్లు సమాచారం. కేబినెట్‌లో చర్చించి దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. 2018 DEC 12 నుంచి తీసుకున్న రుణాలను మాఫీ చేయనుంది. 2-3 రోజుల్లో లబ్ధిదారుల జాబితా ప్రభుత్వానికి చేరనుంది.
Similar News
News January 17, 2025
ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా: KTR
TG: ఈడీ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన ఫొటోలను షేర్ చేసిన ఆయన ‘ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలోనే కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.
News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..
2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
News January 16, 2025
నితీశ్‌కు లోకేశ్ అభినందనలు
AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.