News July 6, 2024
రూ.2లక్షల రుణమాఫీపై BIG UPDATE

TG: ఆగస్టు నుంచి రుణమాఫీ అమలు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత రూ.50వేలు, ఆ తర్వాత రూ.లక్ష, ఇలా పెంచుతూ ఒక్కో రైతు రుణం చెల్లించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 లక్షల మంది రైతుల్లో 70శాతం మందికిపైగా రూ.లక్షలోపే రుణం ఉన్నట్లు అంచనా వేస్తోంది. అటు రైతుభరోసా కింద పెట్టుబడి సాయం ఎవరికి ఇవ్వాలనే దానిపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించనుంది.
Similar News
News January 6, 2026
BREAKING: విజయ్‌కు సీబీఐ నోటీసులు

తమిళనాడు కరూర్ తొక్కిసలాట కేసులో టీవీకే చీఫ్, స్టార్ హీరో విజయ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని ఆదేశించింది. గత ఏడాది సెప్టెంబర్ 27న టీవీకే సభలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించిన విషయం తెలిసిందే.
News January 6, 2026
రాష్ట్రంలో 424 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

<
News January 6, 2026
సక్సెస్‌తో వచ్చే కిక్కే వేరు: CBN

AP: 2025లో పెట్టుబడులు అద్భుతంగా వచ్చాయని, అదే ఉత్సాహంతో 2026లోనూ ముందుకెళ్లాలని CM CBN SIPB సమావేశంలో సూచించారు. ‘టాటా, జిందాల్, బిర్లా, ADANI, RIL,TCS, కాగ్నిజెంట్ వంటివి పెట్టుబడులు పెడుతున్నాయి. గ్రౌండింగ్‌లో పొరపాట్లకు తావుండొద్దు. 2029కి విద్యుత్ కొనుగోలు ఛార్జీ ₹3.70కి తగ్గేలా చేద్దాం’ అని పేర్కొన్నారు. సక్సెస్ ఇచ్చే కిక్ అద్భుతంగా ఉంటుందని, దాని కోసం అందరూ పని చేయాలని వ్యాఖ్యానించారు.


