News February 4, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
TGలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MPTC, ZPTCలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. MPTC స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Similar News
News February 4, 2025
ఐటీ విచారణకు దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
News February 4, 2025
US నుంచి స్వదేశానికి భారతీయ వలసదారులు
వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్బెర్గ్ న్యూస్ పేర్కొంది.
News February 4, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు
నిన్న నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 517 పాయింట్ల లాభంతో 77,704 వద్ద, నిఫ్టీ 154 పాయింట్లు లాభపడి 23,511 వద్ద కొనసాగుతున్నాయి. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.2గా ఉంది.