News February 10, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్‌గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్‌గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్‌గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.
Similar News
News March 29, 2026
అత్యాచార బాధితుల పేర్లను తీర్పుల్లోనూ వాడరాదు: సుప్రీంకోర్టు

అత్యాచార బాధితులు, వారి కుటుంబీకుల పేర్లను తీర్పుల్లోనూ ప్రస్తావించరాదని అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వారిని గుర్తించే అవకాశమున్న ఏ వివరాలనూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలో చెప్పరాదని 2018లోనే అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంది. లైంగిక నేరాల బాధితులకు సమాజంలో ఇబ్బందులు కలగకుండా ఇలా చేసినట్లు పేర్కొంది. ఓ బాలిక వివరాలను HP హైకోర్టు ప్రస్తావించడాన్ని తప్పుపట్టింది.
News March 29, 2026
ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ గురించి తెలుసా?

ప్రెగ్నెన్సీలో మహిళలు మద్యం తాగడం వల్ల బిడ్డకు ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుందంటున్నారు నిపుణులు. దీంతో శిశువుకు శారీరక, మానసిక లోపాలు ఏర్పడతాయంటున్నారు. ప్రెగ్నెన్సీలో ఆల్కహాల్ తీసుకుంటే అది పిండంలోకి సులువుగా చేరుతుంది. కాలేయం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందకపోవడం వల్ల ఆల్కహాల్ శిశువు శరీరంలో పేరుకుపోతుంది. దీంతో శిశువుకు పోషకాలు, ఆక్సిజన్ అందక అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది.
News March 29, 2026
యుద్ధం.. కండోమ్‌ల కొరత

పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కండోమ్‌లపైనా పడింది. వాటి తయారీ కోసం వినియోగించే సిలికాన్ ఆయిల్ (లూబ్రికేషన్ కోసం) లభించట్లేదని HLL లైఫ్ కేర్, మాన్‌కైండ్ ఫార్మా తెలిపాయి. కండోమ్ చిరిగిపోకుండా ఉండేందుకు వాడే అమ్మోనియా ధరలు 40-50% పెరిగాయని పేర్కొన్నాయి. 86% అమ్మోనియాను గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటామని, ఇప్పుడు హార్ముజ్ మూసివేతతో ఇబ్బంది కలుగుతోందని వివరించారు. దీంతో కండోమ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంది.


