News October 11, 2024
గ్రూప్-3 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

తెలంగాణలో గ్రూప్-3 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల తేదీలను TGPSC ప్రకటించింది. నవంబర్ 17, 18 తేదీల్లో OMR విధానంలో పేపర్-1,2,3 పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. పరీక్షలకు వారం ముందు నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు పొందవచ్చని వెల్లడించింది. ఇప్పటికే శాంపిల్ OMR ఆన్సర్ షీటును వెబ్సైటులో అందుబాటులో ఉంచామంది.
Similar News
News November 16, 2025
అది ఛేజ్ చేయగలిగే టార్గెటే: గంభీర్

టెస్టుల్లో ఆడాలంటే స్కిల్‌తో పాటు మెంటల్ టఫ్నెస్ ఉండాలని IND హెడ్ కోచ్ గంభీర్ అన్నారు. SAతో తొలి టెస్టులో <<18303459>>ఓటమి<<>> అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ‘124 ఛేజబుల్ టార్గెటే. పిచ్ ఆడేందుకు వీలుగానే ఉంది. ఇలాంటి పిచ్‌పై ఆడాలంటే టెక్నిక్, టెంపెరమెంట్ ఉండాలి. ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ వికెట్లు పడ్డాయి. మేం అడిగిన పిచ్‌నే క్యూరేటర్ తయారు చేశారు. బాగా ఆడనప్పుడు ఇలాగే జరుగుతుంది’ అని పేర్కొన్నారు.
News November 16, 2025
భారీ జీతంతో CSIR-SERCలో ఉద్యోగాలు

CSIR-స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ సెంటర్ (SERC) 30 సైంటిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 21 నుంచి డిసెంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. ఎంపికైన వారికి నెలకు రూ.1,38,652 చెల్లిస్తారు. వెబ్సైట్: https://serc.res.in/
News November 16, 2025
మేం కాంగ్రెస్‌కు కాదు.. నవీన్‌కు సపోర్టు చేశాం: అసదుద్దీన్

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్‌కు సపోర్టు చేశామని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. కానీ కాంగ్రెస్‌కు మద్దతిచ్చినట్లుగా కొందరు అర్థం చేసుకున్నారన్నారు. నియోజకవర్గాన్ని నవీన్ అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కేసీఆర్ అయినా, తానైనా మా పార్టీలకు మంచి అనిపించేది చేసుకుంటూ వెళ్తామని చెప్పారు.


