News August 4, 2024
11,062 టీచర్ పోస్టుల భర్తీపై BIG UPDATE

TG:11,062 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహిస్తున్న DSC పరీక్షలు రేపటితో ముగియనున్నాయి. ఈ నెలాఖరులో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీని ప్రకటించనున్నారు. ఆ తర్వాత జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెల్లడిస్తారు. అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపడతారు. అటు 1:3 చొప్పున సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Similar News
News March 11, 2026
రోజూ 8-10 లీటర్ల పాలిచ్చే ఆవుకు ఎంత మేత ఇవ్వాలి?

సంకర జాతి పశువులకు వాటి పాల ఉత్పత్తిని బట్టి దాణాను అందించాలని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. రోజుకు 8 నుంచి 10 లీటర్ల పాలిచ్చే సంకరజాతి ఆవుకు ఈత ఈనిన తర్వాత లేదా పాలిచ్చే రోజుల్లో రోజుకు 20-30 కేజీల పచ్చగడ్డి, 4-5 కేజీల ఎండుగడ్డి, 4 నుంచి 4.5 కిలోల దాణా మిశ్రమం ఇవ్వాలి. అలాగే ఇదే పశువు వట్టిపోయిన సమయంలో రోజుకు 20-25 కేజీల పచ్చగడ్డి, 6-7 కేజీల ఎండుగడ్డి, 0.5-1 కేజీ దాణా మిశ్రమం ఇవ్వాలి.
News March 11, 2026
GAILలో 70 పోస్టులు.. మార్చి 18 చివరి తేదీ

గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(GAIL)లో 70 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. BE/BTech,ME/MTech అర్హతగల వారు మార్చి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 26ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు రూ.60,000-రూ.1,80,000 చెల్లిస్తారు. GATE-2026 స్కోరు, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ, అసెస్‌మెంట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సైట్: gailonline.com
News March 11, 2026
జాగ్రత్త.. 3 రోజులు భగభగలు

నేటి నుంచి ఈ నెల 14 వరకు మూడు రోజుల పాటు తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతాయని వాతావరణ నిపుణులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో 37-38 డిగ్రీలు, తూర్పు, ఉత్తర తెలంగాణలో 39-40 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. మధ్యాహ్నం పూట ప్రయాణాలు మానుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.


