News October 27, 2024
16,347 ఉద్యోగాల భర్తీపై BIG UPDATE

AP: 16,347 DSC ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు పరిశీలించి నివేదిక పంపించాలని డీఈవోలను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. గతంలో జిల్లాల వారీగా ఖాళీలు, రోస్టర్ పాయింట్లు, సమాంతర రిజర్వేషన్లు, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్, స్పోర్ట్స్ కోటా అమలుపై వివరాలను ఈ నెల 28లోగా పంపాలంది. కాగా వచ్చే నెల మొదటి వారంలో నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్సుంది.
Similar News
News December 10, 2025
పారిశ్రామిక పార్కుల్లో APదే అగ్రస్థానం

AP: దేశవ్యాప్తంగా ఉన్న 4,597 పారిశ్రామిక పార్కుల్లో అత్యధికంగా 638 ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల సహాయమంత్రి జితిన్ ప్రసాద లోక్సభలో వెల్లడించారు. MPలు పుట్టా మహేశ్, వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. మహారాష్ట్ర 527 పార్కులతో రెండో స్థానంలో, రాజస్థాన్ 460తో మూడో స్థానంలో ఉన్నట్లు తెలిపారు. తెలంగాణలో 169 పారిశ్రామిక పార్కులు ఉన్నాయన్నారు.
News December 10, 2025
పురుగు మందులు.. రైతులకు సూచనలు

ఒకే మందు పొడి మందుగా, నీటిలో కరిగే ద్రావణంగా, గుళికల రూపంలో లభ్యమౌతుంటే.. ఆశించిన తెగులు, పంట దశ, నీటి లభ్యత, సమస్య తీవ్రతను బట్టి ఎంచుకోవాలి. పొడి మందులు గాలికి ఎగిరిపోయి వాతావరణ కాలుష్యం కలిగించవచ్చు. నీటిలో కరిగే పొడిమందులను సరిగా కలపకపోతే స్ప్రేయర్ల నాజిల్స్లో చేరి సరిగా పనిచేయవు. నాసిరకం మందులు కలుపుతున్నప్పుడు చర్మం నుంచి శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అందుకే వీటిని జాగ్రత్తగా వాడాలి.
News December 10, 2025
మొదలైన లారీల బంద్

TGలో లారీల టెస్టింగ్, ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించాలని సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి బంద్ పాటిస్తున్నామని తెలిపింది. 13ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్నెస్, టెస్టింగ్ కోసం రూ.12 వేలు వసూలు చేసేవారని, తాజాగా రూ.30వేలకు పెంచారని మండిపడ్డారు. అటు APలో లారీ ఓనర్ అసోసియేషన్తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం కావడంతో అక్కడ బంద్ తాత్కాలికంగా వాయిదా పడింది.


