News September 16, 2024

జీడీపీ కోసం బిగ్‌బాస్కెట్, బ్లింకిట్ డేటా!

image

GDPని లెక్కించేందుకు బేస్‌ఇయర్ కీలకం. 2011-12గా ఉన్న దీనిని 2023/24కు మార్చాలని ప్రభుత్వం యోచిస్తోంది. అందుకే వినియోగ సరళిలో మార్పులు, ఎకనామిక్ యాక్టివిటీ వేగం తెలుసుకొనేందుకు బ్లింకిట్, బిగ్‌బాస్కెట్ వంటి యాప్స్‌లో కొనుగోళ్లను పరిశీలించనుంది. ప్రస్తుతం ఒక కుటుంబానికి అవసరమైన గ్రాసరీస్‌లో 6% వీటి ద్వారానే కొంటున్నారని అంచనా. GST డేటానూ తీసుకుంటే GDP గణాంకాలు పక్కాగా ఉంటాయని కేంద్రం భావిస్తోంది.

Similar News

News December 12, 2025

డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్‌లో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన డిఫెన్స్ లాబోరేటరీ, జోధ్‌పుర్‌ 20 ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 23 వరకు అప్లై చేసుకోవచ్చు. బీఈ/బీటెక్, ఎంటెక్, ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అప్లై చేసుకోవచ్చు. నెలకు స్టైపెండ్ రూ.5వేలు చెల్లిస్తారు. అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తును స్పీడ్ పోస్ట్ ద్వారా పంపాలి. వెబ్‌సైట్: https://www.drdo.gov.in/

News December 12, 2025

ఉపాధి హామీ పథకం పేరు మార్చిన కేంద్రం

image

ఉపాధి హామీ పథకం పేరు మార్పునకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ‘పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం’గా పేరు మార్చింది. అదే విధంగా ఏడాదికి 120 రోజుల పని దినాలను తప్పనిసరి చేసింది. ఈ స్కీంకు రూ.లక్షా 51 వేల కోట్లు కేటాయించింది.

News December 12, 2025

వై నాట్ వైజాగ్.. అనేలా పరిశ్రమలకు ఆహ్వానం: లోకేశ్

image

AP: విశాఖ ప్రాంతానికి రానున్న కాలంలో 5 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కృషి చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘వై నాట్ వైజాగ్… అనేలా ఐటీ, ఇతర పరిశ్రమల్ని ఆహ్వానిస్తున్నాం. IT, GCC కేంద్రంగా VSP మారుతుంది. ఎకనామిక్ రీజియన్ కూడా ఈ ప్రాంత అభివృద్ధిని మారుస్తుంది. APకి వచ్చే ప్రతి ప్రాజెక్టును ప్రభుత్వానిదిగా భావించి చేయూత ఇస్తాం’ అని వివరించారు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ ఇక్కడకు వస్తున్నాయన్నారు.