News December 13, 2024
BigC 22వ వార్షికోత్సవ సంబరాలు
దక్షిణ భారతదేశంలో నెం1 మొబైల్ రిటైల్ సంస్థ Big C 22వ వార్షికోత్సవ సంబరాల్లో భాగంగా వినూత్న ఆఫర్లు ప్రకటించింది. ఈ సందర్బంగా Big C ఫౌండర్ & సీఎండీ ఎం.బాలుచౌదరి మాట్లాడుతూ.. కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లు, మొబైల్స్‌పై తక్షణ క్యాష్ బ్యాక్, యాక్సెసరీస్‌పై 51% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు తెలిపారు. కస్టమర్లు ఈ ఆఫర్లను వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News January 16, 2025
ఇబ్రహీంపట్నంలో దారుణం.. యువతిపై అత్యాచారం
HYD శివారు ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన వెలుగుచూసింది. బీటెక్ ఫస్టియర్ చదువుతున్న స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. పూర్తి వివరాలు.. మంగళ్‌పల్లిలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న యువతి పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అదే భవనంలో ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద పనిచేసే డ్రైవర్ అత్యాచారం చేశాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో PSలో కేసు నమోదైంది. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
News January 16, 2025
హైదరాబాద్: PhD అడ్మిషన్స్-2025 నోటిఫికేషన్
OUలో 2025 PhD అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించడానికి నోటిఫికేషన్ విడుదైంది. JAN 24 నుంచి FEB 23 వరకు అభ్యర్థులు ఎలాంటి లేట్ ఫీ లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2వేల లేట్‌ఫీతో FEB 24 నుంచి MAR 5 వరకు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కేటగిరీ-2 కింద భర్తీ చేయనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.
News January 16, 2025
నార్సింగి జంట హత్యల్లో మరో ట్విస్ట్
పుప్పాలగూడలో <<15160567>>జంటహత్యలు<<>> నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. క్రైమ్ స్పాట్‌లో వారి ఒంటిపై కత్తిపోట్లు, ముఖంపై రాయితో కొట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 11న మర్డర్లు జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. బిందుతో సాకేత్ వ్యభిచారం చేపించినట్లు తెలిసింది. ఆమెతో సంబంధం పెట్టుకున్న వ్యక్తి వీరిని హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు సమాచారం.