News December 15, 2024
బిగ్ బాస్-8 ఫినాలే.. పోలీసుల హెచ్చరికలు

ఇవాళ బిగ్ బాస్-8 ఫినాలే నేపథ్యంలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అన్నపూర్ణ స్టూడియో పరిసర ప్రాంతాల్లో ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులదే బాధ్యత అన్నారు. గత సీజన్లో విన్నర్ పల్లవి ప్రశాంత్ స్టూడియో నుంచి బయటకు వచ్చాక అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 26, 2026
అండాశయ క్యాన్సర్కు కారణాలివే..

ఒవేరియన్ కేన్సర్కి నిర్దిష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల చివరి దశ వరకూ దీన్ని గుర్తించడం కష్టం. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్గా పరిగణిస్తారు నిపుణులు. అండం విడుదల జరిగే సంఖ్య తగ్గితే అండాశయ కేన్సర్ వచ్చే ప్రమాదం తక్కువని చెబుతున్నారు. రొమ్ము క్యాన్సర్ ఉన్నా, కుటుంబంలో ఎవరికైనా ఉన్నా ఇది వచ్చే అవకాశం ఎక్కువ. పిల్లలు లేకపోయినా, ఆలస్యంగా మెనోపాజ్ వచ్చినా దీని ప్రమాదం పెరుగుతుంది.
News January 26, 2026
అండాశయ క్యాన్సర్ లక్షణాలు

చాలామంది మహిళలు మెనోపాజ్ లక్షణాలను విస్మరిస్తుంటారు. అండాశయ క్యాన్సర్కూ కొన్నిసార్లు ఇవే లక్షణాలుంటాయంటున్నారు నిపుణులు. పొత్తికడుపు ఉబ్బరం, బరువు తగ్గడం, కటి ప్రాంతంలో అసౌకర్యం, అలసట, వెన్నునొప్పి, జీర్ణక్రియలో ఇబ్బంది, సెక్స్ సమయంలో నొప్పి వంటి లక్షణాలుంటాయి. కాబట్టి ఏవైనా అసాధారణ లక్షణాలు, మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
News January 26, 2026
ఎక్కువ సేపు కూర్చుంటున్నారా? గంట జిమ్ చేసినా యూజ్ లేదట!

గంటల తరబడి కూర్చోవడం స్మోకింగ్ కంటే డేంజర్ అని ప్రముఖ కార్డియాలజిస్ట్ అనిల్ కుమార్ వర్మ తెలిపారు. రోజూ 8 గంటల కంటే ఎక్కువ కూర్చునేవారు గంట ఎక్సర్సైజ్ చేసినా ఉపయోగం ఉండదని వెల్లడించారు. కూర్చోవడం వల్ల రక్త ప్రసరణ తగ్గడం, కొవ్వును కరిగించే ఎంజైమ్స్ ఉత్పత్తి ఆగడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వంటి ఎఫెక్ట్స్ ఉంటాయన్నారు. ఫలితంగా హార్ట్ అటాక్ సహా ముందస్తు మరణ ముప్పు పెరుగుతుందని హెచ్చరించారు.


