News May 7, 2025
ముందుగా బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి: సోమిరెడ్డి

AP: జగన్ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ ఓ అంతర్జాతీయ కుంభకోణం అని TDP నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ‘ఈ లిక్కర్ స్కామ్‌లో ముందుగా బిగ్‌బాస్‌ను జైలుకు పంపాలి. అతడి దురాశ వల్లే నాసిరకం మద్యం తాగి ఎంతో మంది పేదలు మృతిచెందారు. ఈ వ్యవహారంలో కేంద్రం జోక్యం చేసుకుని CBI, EDతో విచారణ జరిపించాలి. ఇది రూ.3,200 కోట్ల స్కామ్ కాదు.. రూ.10వేల కోట్లకు పైనే జరిగింది’ అని ప్రెస్‌మీట్‌లో ఆరోపించారు.
Similar News
News April 9, 2026
భూమి, చంద్రుడి HD ఫొటోలు

‘ఆర్టెమిస్-2’ ప్రయోగంలో భాగంగా అంతరిక్షం నుంచి తీసిన చంద్రుడు, భూమి హైక్వాలిటీ ఫొటోలను నాసా విడుదల చేసింది. బూడిద రంగులో జాబిల్లి కనువిందు చేస్తుండగా, భూమి నెలవంక అబ్బురపరుస్తోంది. ప్రస్తుతం వ్యోమగాములు తిరుగు ప్రయాణంలో ఉన్నారు.
News April 9, 2026
విద్యార్థులకు అలర్ట్.. ఆధార్ అప్డేట్ కోసం స్పెషల్ క్యాంపులు

AP: ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డులు, అంగన్వాడీల్లో ప్రభుత్వం స్పెషల్ క్యాంపులు నిర్వహించనుంది. తొలి విడతలో ఈ నెల 15 నుంచి 18 వరకు, రెండో విడతలో ఈ నెల 21 నుంచి 24 వరకు అవకాశం ఉంటుంది. బయోమెట్రిక్ అప్డేట్ లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వ పథకాలు, స్కాలర్‌షిప్‌లు అందడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 12.09 లక్షల మంది తమ డేటాను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది.
News April 9, 2026
ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్.. వసూలుకు ఇరాన్ ప్లాన్

హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే నౌకల నుంచి పెద్ద మొత్తంలో టోల్ వసూలు చేయాలని ఇరాన్ భావిస్తోంది. ప్రతి బ్యారెల్‌కు ఒక డాలర్ చొప్పున ఫీజు విధించాలని ప్లాన్ చేస్తోందని Financial Times తెలిపింది. క్రిప్టోకరెన్సీలో పేమెంట్స్ తీసుకోవాలని అనుకుంటోందని చెప్పింది. జలసంధి నుంచి వెళ్లేందుకు అనుమతించే ముందు ట్యాంకర్‌లోని సరకులను పరిశీలించనుందని అక్కడి అధికారులు చెప్పినట్లు వెల్లడించింది.


