News March 17, 2024
బిగ్ బాస్ విన్నర్ అరెస్ట్

బిగ్ బాస్ OTT2(హిందీ) విన్నర్, యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ అరెస్ట్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై అక్రమంగా పాము విషం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఓ వ్యక్తి కెమెరాతో షూట్ చేసినందుకు అతడిపై భౌతికంగా దాడికి పాల్పడటంతో వార్తల్లోకి ఎక్కారు. కాగా ఎల్విష్ వైల్డ్ కార్డ్‌లో వచ్చి టైటిల్ గెలుచుకున్న మొదటి కంటెస్టెంట్‌గా చరిత్ర సృష్టించారు.
Similar News
News March 10, 2026
తమిళనాడులో NDAకు ఎంట్రీ లేదు: స్టాలిన్

బీజేపీ ఆధ్వర్యంలోని NDAకు తమిళనాడులో ఎంట్రీ లేదని సీఎం స్టాలిన్ అన్నారు. ‘TNకు ఏమీ ఇవ్వకూడదనుకునే వారికి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారు? అయినా ఓట్లు అడిగేందుకు వాళ్లెలా వస్తారు? ఈ ఎన్నికలు తమిళనాడు-NDA మధ్య, DMK టీమ్‌కు-ఢిల్లీ టీమ్‌కు మధ్యే జరుగుతున్నాయి. AIADMKను మింగేయాలని బీజేపీ చూస్తోంది. ఆ పార్టీని చూస్తే జాలి కలుగుతోంది. బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారు’ అని విమర్శించారు.
News March 10, 2026
రాత్రి మంచి నిద్ర కోసం..

రాత్రి వేళ చక్కటి నిద్ర కోసం ఆహారంలో అరటిపండు, పిస్తా, బార్లీ, పాలు, పెరుగు, గుడ్డు తెల్లసొన, గుమ్మడి విత్తనాలు భాగం చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వీటిలోని ట్రిప్టోఫాన్ నిద్రలో కీలకపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఇక కొంతమంది రాత్రి మద్యం తాగితే మంచి నిద్ర పడుతుందని భావిస్తారని, ఇందులో ఏమాత్రం నిజం లేదని చెప్పారు. దానివల్ల నిద్రకు భంగం కలుగుతుందన్నారు.
Share It
News March 10, 2026
యుద్ధం సెగ.. పాక్ కఠిన నిర్ణయాలు

ఇరాన్ యుద్ధం సెగ పాక్‌కు గట్టిగానే తగులుతోంది. ఇంధన కొరతను నివారించేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ వాహనాల ఇంధన కోటాలో 50% కోత విధించింది. 60% వాహనాలను నడపొద్దని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీల జీతాల్లో కోత పెట్టింది. ఆఫీసులను వారానికి 4 రోజులు మాత్రమే తెరవనుంది. స్కూళ్లకు 15 రోజులు సెలవులిచ్చింది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభించాలని సూచించింది.


