News October 15, 2024

ఆంగ్లంలో అతి పెద్ద, చిన్న పదాలు!

image

ఆంగ్ల అక్షరమాలలో 26 అక్షరాలున్నాయి. వీటిని జోడిస్తే వచ్చే అతిపెద్ద పదంలో 45 అక్షరాలుంటాయి. డిక్షనరీ ప్రకారం ‘Pneumonoultramicroscopicsilicovolcanoconiosis’ అనే పదం ఆంగ్లంలో అతిపెద్దది. ఈ పదం ధూళిని పీల్చడం వల్ల కలిగే ఊపిరితిత్తుల వ్యాధిని సూచిస్తుంది. కాగా, I, a, o అక్షరాలను ఆంగ్లంలో అతి చిన్న పదాలుగా చెబుతుంటారు. on, if లాంటి 2-అక్షరాల పదాలు కూడా చాలా ఉన్నాయి.

Similar News

News December 10, 2025

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 5 సీనియర్ అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా(ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్, మెకానికల్ ఇంజినీర్) ఉత్తీర్ణతతో పాటు 15ఏళ్ల పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేసిన అభ్యర్థులు డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవచ్చు. జీతం నెలకు రూ.30,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/

News December 10, 2025

మీ పిల్లల స్కూల్ బ్యాగు ఎంత బరువుండాలంటే?

image

ప్రస్తుతం ప్రైమరీ విద్యార్థులు కూడా మోయలేనంత బరువున్న బ్యాగులతో స్కూళ్లకు వెళ్తూ ఇబ్బందిపడుతున్నారు. అయితే ‘NEP-2020’ మార్గదర్శకాల ప్రకారం స్కూల్ బ్యాగ్ బరువు పిల్లల శరీర బరువులో 10 శాతం ఉండాలి. ప్రీ ప్రైమరీకి బ్యాగులే ఉండవు. 5వ తరగతి వరకు 1.6-2.5KG, 6-7 క్లాస్‌కి 2-3KG, 9-10 విద్యార్థుల బ్యాగులు 2.5-4.5KG మించకూడదు. అధిక భారం వల్ల పిల్లలకు వెన్ను నొప్పి, భుజాల సమస్యలు రావొచ్చు. SHARE IT

News December 10, 2025

మహిళలు టూర్లకు ఎక్కువగా ఎందుకు వెళ్లాలంటే?

image

ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఇప్పుడు సోలోగా ట్రిప్స్ వేయడానికి ఇష్టపడుతున్నారు. ఇది మన సమాజంలో వస్తున్న ఓ పెద్ద మార్పు. మహిళలు టూర్లకు వెళ్లడం వల్ల ఎంపవర్‌మెంట్, ఫ్రీడమ్, పర్సనల్ గ్రోత్, ఆత్మవిశ్వాసం, మానసిక ఆరోగ్యం మెరుగవడం, కొత్త సంస్కృతుల గురించి తెలుసుకోవడం, కొత్త బంధాలు, నైపుణ్యాలు నేర్చుకోవడానికి వీలవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి మహిళలు టూర్లకు వెళ్లడం అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.