News March 19, 2024
అతిపెద్ద గేమ్ షో.. బహుమతి రూ.41 కోట్లు!
వరల్డ్ మోస్ట్ పాపులర్ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్‌సన్) తన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. తాను అతిపెద్ద గేమ్ షోను చిత్రీకరించబోతున్నానని ట్వీట్ చేశారు. దీనిని అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేస్తామని చెప్పారు. ఈ గేమ్ షోలో వెయ్యి కంటే ఎక్కువ మంది గేమర్స్ పోటీ పడతారని, 5 మిలియన్ల డాలర్ల ( దాదాపు రూ.41 కోట్లు) బహుమతి ఉంటుందని తెలిపారు. దీనికి కాస్త టైమ్ పడుతుందని వెల్లడించారు.
Similar News
News January 7, 2025
ఏకకాలంలో 3 భాషల్లో ‘డాకు మహారాజ్’ విడుదల!
నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన ‘డాకు మహారాజ్’ సినిమా ఈనెల 12న విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెలుగు, హిందీ, తమిళంలో విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమైనట్లు సినీవర్గాలు తెలిపాయి. తమిళంతోపాటు హిందీలో బిగ్ సినిమాలు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహరాజ్’ సినిమాల హవా నడవనుంది.
News January 7, 2025
జాహ్నవికి న్యాయం దక్కింది
2023 జనవరిలో అమెరికా సియాటెల్‌లో పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని మరణించిన తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల(23)కి ఎట్టకేలకు న్యాయం దక్కింది. కారును అతివేగంగా నడిపిన కెవిన్ డేవ్ అనే పోలీస్‌ను ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె మరణం పట్ల హేళనగా, నవ్వుతూ మాట్లాడిన <<13652111>>డానియెల్ అడెరర్‌ను<<>> ఇప్పటికే సస్పెండ్ చేశారు. ‘ఆమె మరణానికి విలువలేదు’ అంటూ అడెరర్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనమయ్యాయి.
News January 7, 2025
కేటీఆర్‌కు మరోసారి నోటీసులు
TG: ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్‌కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఆయన ఇవాళ ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉండగా, విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే వ్యవహారంలో ఈనెల 9న ఆయన ఏసీబీ విచారణకు హాజరు కావాల్సి ఉంది.