News November 14, 2024

రంజీ చరిత్రలో అతిపెద్ద విజయం

image

రంజీల్లో గోవా జట్టు సంచలనం సృష్టించింది. రంజీ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకుని రికార్డులకెక్కింది. అరుణాచల్ ప్రదేశ్‌పై ఇన్నింగ్స్ 551 పరుగుల తేడాతో నెగ్గి ఈ ఫీట్ సాధించింది. ఈ క్రమంలో అస్సాం (త్రిపుర-ఇన్నింగ్స్ 472/1991) రికార్డును అధిగమించింది. ఆ తర్వాత బొంబాయి (సింధ్-ఇన్నింగ్స్ 453/1947), మేఘాలయ (మిజోరం-ఇన్నింగ్స్ 425/2020), బెంగాల్ (అస్సాం-ఇన్నింగ్స్ 413/1952) ఉన్నాయి.

Similar News

News November 15, 2024

మొదటిది ఎప్పటికీ ప్రత్యేకమే!

image

ఇండియాలో నివసించే ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు పొందాల్సిందే. అయితే, తొలి ఆధార్ కార్డును ఎవరికి ఇచ్చారో తెలుసా? 2010 సెప్టెంబర్ 29న మహారాష్ట్రకు చెందిన రంజనా సోనావానే అనే మహిళకు ఇచ్చారు. దీంతో ఆమె చరిత్రలో తొలి ఆధార్ పొందిన వ్యక్తిగా నిలిచిపోయారు. కాగా, భారత తొలి ఫైవ్ స్టార్ హోటల్ ముంబై తాజ్ హోటల్. తేజస్ ఎక్స్‌ప్రెస్ భారతదేశపు తొలి ప్రైవేట్ ట్రైన్, ఫస్ట్ ఇంజినీరింగ్ కాలేజ్ IIT రూర్కీ కావడం విశేషం.

News November 15, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: నవంబర్ 15, శుక్రవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5:06
✒ సూర్యోదయం: ఉదయం 6:21
✒ దుహర్: మధ్యాహ్నం 12:01
✒ అసర్: సాయంత్రం 4:04
✒ మఘ్రిబ్: సాయంత్రం 5:40
✒ ఇష: రాత్రి 6.55
>> నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.