News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Similar News
News August 31, 2025
జగన్‌కు ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఫోన్

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతివ్వాలని ఇండీ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి YS జగన్‌కు ఫోన్ చేసినట్లు వైసీపీ ట్వీట్ చేసింది. కానీ ముందుగానే NDA అభ్యర్థి రాధాకృష్ణన్‌కు మాట ఇచ్చినట్లు జగన్ తెలిపారని పేర్కొంది. మద్దతు ఇవ్వలేకపోతున్నందుకు అన్యధా భావించవద్దని కోరినట్లు చెప్పింది. సుదర్శన్ రెడ్డి న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలకు అపార సేవలు అందించారని కొనియాడినట్లు వివరించింది.
News August 31, 2025
రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా: భట్టి

TG: కాళేశ్వరం ప్రాజెక్టుతో వాడుకున్న నీళ్ల కంటే ఎత్తిపోసి, వదిలేసినవే ఎక్కువ అని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో అన్నారు. ‘రూ.27 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి ఉంటే ఎంతో మేలు జరిగేది. బ్యారేజీల విషయంలో మా రిపోర్టుకు వ్యతిరేకంగా వెళ్లారని CWC చెప్పింది. రూ.1.27 లక్షల కోట్ల ప్రజాధనం వృథా చేయడం చిన్న విషయం కాదు. మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని BRS హయాంలోనే NDSA చెప్పింది’ అని తెలిపారు.
News August 31, 2025
SEP నుంచి ఏమేం మారుతాయంటే!

*SEP 3, 4 తేదీల్లో జరగనున్న 56వ GST సమావేశంలో 4 శ్లాబులకు బదులు.. 5%, 18% శ్లాబులను మాత్రమే ఖరారు చేసే అవకాశం.
*రేపటి నుంచి వెండి ఆభరణాలకు హాల్ మార్క్ విధానం అమలు కావొచ్చు.
*కొన్ని SBI క్రెడిట్ కార్డ్స్‌కు డిజిటల్ గేమింగ్, Govt పోర్టల్స్‌లో పేమెంట్స్ రివార్డు పాయింట్స్ ఉండవు.
*SEP 30లోపు జన్‌ధన్ ఖాతాలకు KYC పూర్తి చేయాలి.
*2025-26 అసెస్మెంట్ ఇయర్ ITR ఫైలింగ్‌కు SEP 15 చివరి తేదీగా ఉంది.