News June 4, 2024
Bihar: నితీశ్ను లాగేయడం కలిసొచ్చింది!

రాజకీయ రణరంగంలో ఎత్తుకు పైఎత్తులు వేయడం ఎంత ముఖ్యమో మళ్లీ నిరూపణ అయింది. బిహార్లో నితీశ్ను తమవైపు తిప్పుకోవడం బీజేపీకి చాలా కలిసొచ్చింది. లేదంటే యూపీ తరహాలో ఇక్కడా దెబ్బపడేది. ఈ రాష్ట్రంలో కులాలకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈసీ వెబ్సైట్ ప్రకారం మొత్తం 40 సీట్లలో ఎన్డీయే పార్టీలైన జేడీయూ 15, బీజేపీ 13, ఎల్జేపీ 5 చోట్ల ఆధిక్యంలో ఉన్నాయి. ఇండియా కూటమి 6 స్థానాల్లో పోటీలో ఉంది.
Similar News
News January 13, 2026
51పోస్టులు.. దరఖాస్తుకు ఎల్లుండే లాస్ట్ డేట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<
News January 13, 2026
‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ రివ్యూ&రేటింగ్

పెళ్లైన వ్యక్తి ఓ అమ్మాయితో రిలేషన్ పెట్టుకొని భార్యకు తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడనేది స్టోరీ. రవితేజ నటన, సునీల్, వెన్నెల కిశోర్, సత్య కామెడీ, మ్యూజిక్ ప్లస్. హీరోయిన్ పాత్రలకు ప్రాధాన్యం దక్కింది. ఆషికా రంగనాథ్ గ్లామర్ యువతను మెప్పిస్తుంది. కొన్ని సన్నివేశాలు సాగదీతగా అన్పిస్తాయి. స్క్రీన్ ప్లే, కథను నడిపించడంలో డైరెక్టర్ తడబడ్డారు. మూవీ క్లైమాక్స్ నిరాశకు గురి చేస్తుంది.
రేటింగ్: 2.25/5
News January 13, 2026
బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే.. గుండెకు ముప్పే: వైద్యులు

రోజువారీ అల్పాహారం మానేస్తే గుండెపోటు ముప్పు పెరుగుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతేడాది 23లక్షల మందిపై జరిపిన పరిశోధనలో బ్రేక్ఫాస్ట్ మానేస్తే గుండె జబ్బుల ముప్పు 17%, స్ట్రోక్ ప్రమాదం 15 శాతం పెరుగుతుందని తేలింది. ‘దీనివల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరుగుతాయి. బరువు తగ్గాలనుకునే వారు ఉదయం టిఫిన్ మానేయడం కంటే, రాత్రి త్వరగా భోజనం చేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.


