News September 22, 2025
అక్టోబర్ తొలివారంలో బిహార్ ఎన్నికల షెడ్యూల్?

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ తొలి వారంలో షెడ్యూల్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించేందుకు EC సిద్ధమవుతోంది. ఈ ఎన్నికను BJP, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. NDAలో కీలకంగా ఉన్న అధికార జేడీయూకు BJP మద్దతు ఇస్తోంది. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ కేంద్రం బిహార్‌కు పెద్దపీట వేస్తోంది. అటు INC నేత రాహుల్ గాంధీ SIRకు వ్యతిరేకంగా యాత్ర చేసి ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
Similar News
News September 22, 2025
H1B వీసాల ప్రభావం.. ఐటీ షేర్లు ఢమాల్

H1B వీసాల ఫీజు పెంపు ప్రభావం భారతీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 82,363 వద్ద, నిఫ్టీ 80 పాయింట్లు నష్టపోయి 25,264 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా H1B వీసాల ప్రభావంతో టెక్ మహీంద్రా, TCS, ఇన్ఫోసిస్, HCL టెక్ షేర్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
News September 22, 2025
కారణం లేకుండా మాపైకి రావడంతో దీటుగా బదులిచ్చా: అభిషేక్

ASIA CUP: నిన్నటి భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ- రౌఫ్, అఫ్రీది మధ్య హీటెడ్ డిస్కషన్ జరిగింది. వీటిపై అభిషేక్ స్పందిస్తూ.. ‘కారణం లేకుండా పాక్ ప్లేయర్లు మాపైకి వచ్చారు. అది నాకు నచ్చలేదు. అందుకే వారికి దీటుగా బదులిచ్చా. జట్టు విజయం కోసం పోరాడా’ అని చెప్పారు. గిల్‌తో భాగస్వామ్యంపై మాట్లాడుతూ.. ‘ఇద్దరం స్కూల్ డేస్ నుంచి కలిసి ఆడుతున్నాం. ఒకరి ఆటను మరొకరం గౌరవిస్తాం’ అని చెప్పారు.
News September 22, 2025
KBCలో రూ.50లక్షలు గెలుచుకున్న కార్పెంటర్

అమితాబ్ బచ్చన్ ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’తో ఓ సామాన్యుడు కోటీశ్వరుడు కాకపోయినా లక్షాధికారి అయ్యాడు. పంజాబ్‌లోని హుస్సేన్‌పూర్‌కు చెందిన చందర్‌పాల్ కార్పెంటర్ వర్కర్. పెద్దగా చదువుకోకపోయినా వివిధ అంశాలపై జ్ఞానం పొంది, కేబీసీలో పాల్గొన్నాడు. అమితాబ్ అడిగిన రూ.50 లక్షల ప్రశ్నకు ఆడియన్స్ పోల్, 50-50 ఆప్షన్లు వాడుకొని సరైన సమాధానం చెప్పాడు. పిల్లల చదువుకు, వ్యాపార విస్తరణకు డబ్బును ఉపయోగిస్తానన్నాడు.