News October 7, 2025

బిహార్‌ ఎలక్షన్స్.. బీజేపీ, జేడీయూకి సమాన సీట్లు!

image

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల కసరత్తు జరుగుతోంది. మొత్తం 243 సీట్లలో 205 చోట్ల ఇరు పార్టీలు సమాన స్థానాల్లో బరిలో దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 38 సీట్లు NDAలోని LJP, HAM, RLMలకు ఖరారయ్యే అవకాశం ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ, జేడీయూ కలిసి పోటీ చేసి అధికారం చేపట్టాయి. ఇక బిహార్ ఎన్నికలు NOV 6, 11న జరగనుండగా 14న ఫలితాలు వెలువడతాయి.

Similar News

News October 7, 2025

విద్యారంగాన్ని సర్వనాశనం చేశారు: జగన్

image

AP: విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని కూటమి ప్రభుత్వంపై జగన్ మండిపడ్డారు. ‘మనం మరో 5 ఏళ్లు కొనసాగుంటే విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందేవారు. మన విద్యా పథకాలను నిర్వీర్యం చేశారు’ అని విమర్శించారు. ఫీజు రీయింబర్సుమెంటు ఇవ్వడం లేదని, పిల్లలు చదువులు మానేస్తున్నారని చెప్పారు. రైతులనూ నిండా ముంచారని పేర్కొన్నారు. గిట్టుబాటు ధరలు లేకపోగా ఎరువులు రేట్లు పెంచి అమ్ముతున్నారని ఆరోపించారు.

News October 7, 2025

మాజీ ప్రధాని దేవెగౌడకు అస్వస్థత

image

మాజీ ప్రధాని HD దేవెగౌడ(92) అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్(UTI)తో బాధపడుతున్న ఆయనను నిన్న బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు.

News October 7, 2025

మలయాళ సూపర్‌స్టార్‌కు అరుదైన గౌరవం

image

మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నుంచి ఆయన COAS కమెండేషన్ కార్డ్ అందుకున్నారు. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ మోహన్‌లాల్ ట్వీట్ చేశారు. ‘హానరరీ లెఫ్టినెంట్ కల్నల్ గుర్తింపు దక్కడం గర్వంగా ఉంది. ఆర్మీ చీఫ్‌, నా మాతృసంస్థైన టెరిటోరియల్ ఆర్మీకి ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఆయన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.