News June 1, 2024

బీజేపీ ఖాతాలోకే బిహార్: India Today

image

బిహార్‌లో బీజేపీ ప్రభంజనం సృష్టిస్తుందని India Today Axis My India తెలిపింది. 40 సీట్లకు గానూ ఎన్డీఏ: 29-33, ఇండియా: 07-10 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆయా పార్టీలకు సొంతంగా బీజేపీ: 13-15, జేడీయూ: 9-11, ఆర్జేడీ: 6-7, కాంగ్రెస్: 1-2, చిరాగ్ పార్టీకి 5 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలిపింది.

Similar News

News November 11, 2025

సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

image

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్‌సైట్: https://surveyofindia.gov.in

News November 11, 2025

యంగ్‌గా ఉండాలా.. ఎక్కువ భాషలు నేర్చుకో

image

వయసు పెరుగుతున్నా యంగ్‌గా కనిపించాలని అందరూ కోరుకుంటారు. ఒకే భాషలో మాట్లాడేవారితో పోలిస్తే 2 అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడేవారి మెదడు యవ్వనంగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. 27 యూరోపియన్ దేశాలలో 51-90 ఏళ్ల మధ్య వయసులో ఉన్న 80వేల మందిపై జరిపిన స్టడీలో ఇది వెల్లడైంది. ఒకే భాషలో మాట్లాడేవారి మెదడు 2 రెట్లు త్వరగా వృద్ధాప్య దశకు చేరుకుంటున్నట్టు స్పష్టమైంది. లేటెందుకు ఈరోజు నుంచే కొత్త భాష నేర్చుకోండి.

News November 11, 2025

కాసేపట్లో ఎగ్జిట్ పోల్స్.. Way2Newsలో వేగంగా..

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఎగ్జిట్ పోల్స్ ఈ సాయంత్రం విడుదల కానున్నాయి. సా.6.30 గం.కు వివిధ ఏజెన్సీలు ఎగ్జిట్ పోల్స్ ప్రకటించనున్నాయి. Way2Newsలో వేగంగా వాటిని తెలుసుకోవచ్చు. మరోవైపు ఈ నెల 14న ఎన్నికల తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి.