News March 18, 2024
భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా బిక్షమయ్య గౌడ్..?

భువనగిరి పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. BNG, NLG స్థానాలను బీసీ, ఓసీలకు కేటాయించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం. అందులో భాగంగా గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఉన్నందున BNG సీటును అదే సామాజికవర్గానికి చెందిన బిక్షమయ్య గౌడ్కు కేటాయించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది.
Similar News
News October 20, 2025
మంత్రి కోమటిరెడ్డి దీపావళి విషెస్

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళిని ‘జ్ఞాన వెలుగులు నింపే పండుగ’గా ఆయన అభివర్ణించారు. దీపాలు చీకటిని తరిమినట్టుగానే, ఈ పండుగ ప్రజల జీవితాల్లోని అజ్ఞానమనే చీకటిని తొలగించి, నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు ప్రతి ఇంట్లో సకల శుభాలు కలిగించాలని కోరారు.
News October 20, 2025
నల్గొండ: పత్తి కూలీల ఆటో, ట్రాక్టర్ ఢీ

ముప్పారంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని శోకంలో ముంచింది. పత్తికూలీల ఆటోను ట్రాక్టర్ బలంగా ఢీకొనడంతో ఆలంపల్లి సాయిలు అనే కూలీ ఘటనాస్థలంలోనే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో 8 మంది కూలీలు గాయపడ్డారు. వీరిలో ఒకరికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను 108లో మిర్యాలగూడ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని స్థానికులు కోరుతున్నారు.
News October 20, 2025
నల్గొండ: రేకుల షెడ్లో ఉంటున్నాం.. ఇల్లు ఇవ్వరూ..!

త్రిపురారం మండలం పెద్దదేవులపల్లిలో అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు దక్కడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నా నాయకులు అనర్హులకు ఇళ్లను కేటాయించి తమను విస్మరిస్తున్నారని కొల్లి సరస్వతి, దుర్గయ్య దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రేకుల షెడ్లో నివసిస్తున్నామని, అధికారులు తక్షణమే స్పందించి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.