News June 25, 2024

వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కొత్త రెవెన్యూ చట్టంపై బిల్లు?

image

TG: భూ సమస్యల పరిష్కారానికి కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 122 రెవెన్యూ చట్టాలన్నింటినీ ఒకే చట్టంగా రూపొందించాలని భావిస్తోంది. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌నూ మార్చనున్నట్లు సమాచారం. భూ సమస్యల పరిష్కారానికి జిల్లా, రాష్ట్ర స్థాయిలో ల్యాండ్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Similar News

News January 3, 2026

మీడియా ముందుకు దేవా

image

TG: రాష్ట్రంలో పెద్దఎత్తున మావోయిస్టులు లొంగిపోయినట్లు DGP శివధర్ రెడ్డి పేర్కొన్నారు. కీలక నేతలు బర్సే దేవా, కంకనాల రాజిరెడ్డి, రేమలతో పాటు మరో 17మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు తెలిపారు. వారు 48 తుపాకులు, 93 మ్యాగ్జిన్లు, 2206 బుల్లెట్స్, రూ.20,30,000 నగదు అప్పగించినట్లు వెల్లడించారు. దేవాపై రూ.75లక్షల రివార్డ్ ఉంది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో మరణించిన అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా 15 ఏళ్లు పనిచేశారు.

News January 3, 2026

IIIT డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలులో ఉద్యోగాలు

image

<>IIIT <<>>డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు 10 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి జనవరి 24వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, రీసెర్చ్ ప్రజెంటేషన్(PPT), ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://iiitk.ac.in

News January 3, 2026

కేసీఆర్, జగన్ ఏపీకి మేలు చేయాలని చూశారు: ఉత్తమ్

image

TG: గతంలో కేసీఆర్, జగన్ చర్చించుకొని ఏపీకి మేలు చేయాలని చూశారని మంత్రి ఉత్తమ్ కుమార్ అసెంబ్లీలో PPT సందర్భంగా ఆరోపించారు. ‘గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తామని కేసీఆర్ అన్నారు. బేసిన్లు లేవు, భేషజాలు లేవు అని చెప్పింది ఆయనే. ఏపీ-తెలంగాణ వేర్వేరు కాదన్నారు. 2015లో కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల వాటాకు అంగీకరించిందే కేసీఆర్ అని’ పునరుద్ఘాటించారు.