News October 27, 2025
నవీన్ యాదవ్ తండ్రి సహా 170 మంది రౌడీషీటర్ల బైండోవర్

TG: ఈసీ ఆదేశాలతో జూబ్లీహిల్స్‌లో 170 మంది రౌడీషీటర్లను పోలీసులు బైండోవర్ చేశారు. ఈ జాబితాలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్, సోదరుడు రమేశ్ యాదవ్ ఉన్నారు. నవీన్ యాదవ్ నామినేషన్ ర్యాలీలో పలువురు రౌడీ షీటర్లు పాల్గొన్న నేపథ్యంలో ఈసీ చర్యలకు దిగింది. ఎన్నికల వేళ కేసులు నమోదయితే కఠిన చర్యలు తీసుకోనుంది.
Similar News
News October 27, 2025
రేపు విజయవాడలో భారీ వర్షాలు.. బయటకు రావొద్దని వార్నింగ్

AP: మొంథా తుఫాన్ ప్రభావంతో రేపు విజయవాడలో 16 CMలకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. తీవ్రత ఎక్కువ ఉంటే దుకాణాలు, మాల్స్ మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. మెడికల్ షాపులు, కూరగాయలు, మిల్క్ దుకాణాలు తెరుచుకోవచ్చన్నారు.
*కలెక్టరేట్ కంట్రోల్ నం.9154970454
News October 27, 2025
వాహనదారులూ.. ఇది తప్పక తెలుసుకోండి!

మీరు నడిపే వాహనం టైర్లకు సంబంధించిన గరిష్ఠ వేగ పరిమితిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. టైర్‌పై రాసి ఉన్న కోడ్‌లోని చివరి అక్షరం దాని వేగ పరిమితిని సూచిస్తుంది. L ఉంటే 120kmph, N- 140kmph, P- 150kmph, Q- 160kmph, R- 170kmph, S- 180kmph, T- 190kmph, H- 210kmph, V- 240kmph, W- 270kmph, Y- 300kmph వేగం వరకే వెళ్లాలి. లిమిట్‌ను మించి వేగంగా ప్రయాణిస్తే టైర్ పేలిపోయే ప్రమాదం ఉంది. SHARE IT
News October 27, 2025
ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

AP: ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్(మార్చి 2026) ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి భరత్ గుప్తా పేర్కొన్నారు. ఈనెల 22తో ఆ గడువు ముగియగా తాజాగా పొడిగించారు. లేటు ఫీజు రూ.1,000తో నవంబర్ 6వ తేదీవరకు చెల్లించవచ్చని వివరించారు. మరోసారి ఫీజు చెల్లింపు గడువు పొడిగించేది లేదని స్పష్టం చేశారు.


