News February 24, 2025
రేపటి నుంచి బయో ఏషియా సదస్సు

TG: లైఫ్ సైన్సెస్‌లోని పరిశోధనలు, పారిశ్రామికవేత్తలు, విధాన రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చే 22వ బయో ఏషియా సదస్సు రేపు, ఎల్లుండి HYDలోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమాన్ని CM రేవంత్ ప్రారంభిస్తారు. దీనికి 50 దేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. కేంద్రమంత్రి పీయూశ్ గోయల్, నీతి ఆయోగ్ మాజీ CEO అమితాబ్ కాంత్, ఇస్రో మాజీ ఛైర్మన్ సోమనాథ్ సహా పలు ఫార్మా కంపెనీల ఛైర్మన్లు ప్రసంగిస్తారు.
Similar News
News February 24, 2025
RC16 షూటింగ్ ఢిల్లీకి షిఫ్ట్?

బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్-జాన్వీ జంటగా నటిస్తున్న RC16 మూవీ షెడ్యూల్ HYDలో పూర్తయినట్లు తెలుస్తోంది. చెర్రీ-దివ్యేందులపై క్రికెట్ సన్నివేశాలను తెరకెక్కించినట్లు సమాచారం. మార్చి ఫస్ట్ వీక్‌లో ఢిల్లీలో కుస్తీ నేపథ్య సీన్లను చిత్రీకరిస్తారని, కీలక నటీనటులంతా పాల్గొంటారని టాక్. ఈ చిత్రానికి ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉండగా MAR 27న చరణ్ బర్త్ డే సందర్భంగా టీజర్ విడుదలయ్యే అవకాశం ఉంది.
News February 24, 2025
నేడు పీఎం కిసాన్ నిధుల విడుదల

ప్రధాని మోదీ నేడు పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ఆయన 19వ విడత కింద దేశంలోని రైతులకు రూ.22వేల కోట్ల నిధులను విడుదల చేస్తారు. రైతులకు ఏడాదిలో ఒక్కో విడతలో రూ.2వేలు చొప్పున 3 విడతల్లో కేంద్రం రూ.6వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. 2019లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 18 విడతల్లో రూ.3.46లక్షల కోట్లు చెల్లించారు.
News February 24, 2025
తిరుమల భక్తులకు అలర్ట్

తిరుమల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు ఇవాళ ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. మే నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో రిలీజ్ చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతి గదుల కోటా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తేనుంది.
వెబ్‌సైట్: <