News December 20, 2024
బిపిన్ రావత్ హెలికాఫ్టర్ ప్రమాదం.. మానవ తప్పిదమే కారణం

మాజీ CDS బిపిన్ రావత్ 2021 DECలో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని IAF ధృవీకరించింది. ఇందుకు సంబంధించిన రిపోర్టును తాజాగా లోక్ సభకు అందించింది. 2017-2022 మధ్య జరిగిన 34 ఎయిర్క్రాఫ్ట్ ప్రమాదాల్లో 16 హ్యుమన్ ఎర్రర్ వల్లే జరిగాయని పేర్కొంది. TNలోని కన్నూరులో జరిగిన ప్రమాదంలో బిపిన్తో పాటు ఆయన భార్య మధులిక, మరో 11 మంది చనిపోయారు.
Similar News
News January 1, 2026
విషాదం.. ముగ్గురు పిల్లలను చంపి తండ్రి ఆత్మహత్య

AP: న్యూఇయర్ వేళ నంద్యాలలో విషాదం చోటు చేసుకుంది. తుడుములదిన్నె గ్రామంలో ముగ్గురు పిల్లలు కావ్యశ్రీ(7), ధ్యానేశ్వరి(4), సూర్యగగన్(2)కు విషమిచ్చి సురేందర్(35) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిల్లలను పెంచే స్తోమత లేక సురేంద్ర ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. గతేడాది సురేంద్ర భార్య మహేశ్వరి(32) అనారోగ్యంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.
News January 1, 2026
పండగకు, జాతరకు స్పెషల్ బస్సులు.. ఛార్జీల పెంపు!

TG: సంక్రాంతికి, మేడారం జాతరకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా RTC ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సంక్రాంతికి HYD నుంచి ఈ నెల 9-13 వరకు 6,431 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. అటు మేడారం జాతరకు ఈ నెల 25 నుంచి హైదరాబాద్ నుంచే 3,495 స్పెషల్ బస్సులు నడుపుతామని పేర్కొన్నారు. రెగ్యులర్ బస్సుల్లో సాధారణ టికెట్ ఛార్జీలు, ప్రత్యేక బస్సుల్లో 50% మేర పెంపు ఉంటాయన్నారు.
News January 1, 2026
కరెంట్ ఛార్జీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం!

AP: కరెంట్ ఛార్జీలపై ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుమారు ₹4,498 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని జనంపై మోపకుండా తానే భరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు APERCకి అధికారులు లేఖ రాశారు. గత సెప్టెంబర్లోనూ ₹923 కోట్లను ప్రభుత్వం ట్రూడౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గత నవంబర్ నుంచి <<17870164>>ట్రూడౌన్లో<<>> భాగంగా వినియోగదారులు ఉపయోగించే ఒక్కో యూనిట్పై 13 పైసలు తగ్గింపు ఇస్తున్నారు.


