News March 28, 2024

ఆవు పాలల్లో బర్డ్ ఫ్లూ.. అమెరికాలో కలకలం

image

అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.

Similar News

News March 17, 2026

వేసవిలో చల్లదనాన్నిచ్చే తాటి ముంజలు

image

వేసవిలో చల్లదనాన్నిచ్చే తాటి ముంజలు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతంలో రైతులు తమ పొలాలలో విరివిగా లబించే తాటి ముంజులను ఆరగిస్తున్నారు. ప్రజలంతా ఎంతో ఇష్టపడి తినే వాటిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. రుచికరంగా ఉండే తాటి ముంజులను అందరూ ఇష్టంగా తింటారు. తెల్లగా మెరుస్తూ ఎంతో మృదువుగా ఉంటాయి. అందుకే వీటిని ఐస్ యాపిల్స్‌గా కూడా పిలుస్తారు.

News March 17, 2026

కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

image

సిలిండర్ బుకింగ్‌లో ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) కొత్త హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు(IVRS). <<19379922>>ఓల్డ్ నంబర్స్<<>> కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది. share it

News March 17, 2026

రంగంలోకి ‘డూమ్స్ డే’ విమానాలు.. వీటి ప్రత్యేకత ఇదే

image

USకు చెందిన శక్తిమంతమైన E-6B మెర్క్యూరీ(డూమ్స్ డే) విమానాలు పశ్చిమాసియాలో మరోసారి కనిపించడం కలకలం రేపింది. అణ్వాయుధ దాడి జరిగి భూమిపైన US సిగ్నలింగ్ వ్యవస్థ నాశనమైనప్పుడే వీటిని రంగంలోకి దించుతారు. 150 ఫీట్ల పొడవుండే ఈ విమానాలు 40వేల అడుగుల ఎత్తుకు చేరుకోగలవు. ఆకాశంలోనే ఇంధనం నింపుకుంటూ 7K మైళ్లు ప్రయాణించగలవు. ప్రపంచవ్యాప్తంగా US దాచిన క్షిపణులను వీటి ద్వారా ప్రయోగించవచ్చు.